Zodiac Signs : నవంబర్ 08 మంగళవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Authored By Varun G | The Telugu News | Published on: November 7, 2022, 10:40 pm

Zodiac Signs : మేష రాశి : ఈరోజు మీరు చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని వల్ల మీరు చాలా ఒత్తిడికి గురవుతారు. మెడిటేషన్ చేస్తే మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలుగుతారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు అంతగా అనుకూలించదు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్య సమస్యలు ఉండవు. వృషభ రాశి : ఈరోజు మీకు అంతగా అనుకూలించదు. మీ మైండ్ ను పాజిటివ్ గా ఉంచుకోండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి పని విషయంలో అంతగా అనుకూలించదు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. తనను మీరు అర్థం చేసుకోలేరు. ఆర్థికంగా పర్వాలేదు కానీ.. ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. ఈరోజు మిమ్మల్ని తలనొప్పి వేధిస్తుంది. మానసిక ఒత్తిడికి గురవుతారు.

మిధున రాశి : ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన రోజు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. జలబు వేధిస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. కర్కాటక రాశి : మీకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు బాధించవు. ఆరోగ్యం సహకరిస్తుంది.

Today Horoscope November 08 2022 Check Your Zodiac Signs

Today Horoscope November 08 2022 Check Your Zodiac Signs

సింహ రాశి : ఈరోజు మీకు అంతగా అనుకూలించదు. ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన రోజు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. డబ్బులకు కొదవ ఉండదు. ఆరోగ్యం సహకరిస్తుంది.

కన్య రాశి : ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. దాని వల్ల అనుకున్న పనులేవీ జరగవు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు పలు చాలెంజింగ్ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పనిలో తప్పులు దొర్లే ప్రమాదం ఉంది. మీ జీవిత భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకోలేరు. డబ్బు సమస్యలు వేధిస్తాయి. తలనొప్పి వేధిస్తుంది.

తుల రాశి : ఈరోజు మీరు టెన్షన్ కు గురవుతారు. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి ఎక్కువవుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడపలేరు. డబ్బు సమస్యలు బాధిస్తాయి. తలనొప్పి వేధిస్తుంది.

వృశ్చిక రాశి : ఈరోజు మీకు అనుకూలమైన రోజు. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకున్న పనులు నెరవేరవు. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం సహకరిస్తుంది.

ధనుస్సు రాశి : ఈరోజు కొత్త వ్యక్తులను కలుస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు ఎంత పని చేసినా పనికి తగ్గ గుర్తింపు లభించదు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం సహకరిస్తుంది.

మకర రాశి : అనుకోని సమస్యలు ఎదురవుతాయి. అనుకున్న పనులు పూర్తి కావు. పని ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో గొడవలు అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. తలనొప్పి వేధిస్తుంది.

కుంభ రాశి : మీ లక్ష్యాలను చేరుకునేందుకు మీరు చాలా కష్టపడతారు. ఈరోజు మీకు అనుకూలమైన రోజు. ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈరోజు పని ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడపలేరు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

మీన రాశి : అనుకున్న పనులేవీ పూర్తికావు. మీ పని బాధ్యతలు ఎక్కువవుతాయి. ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం సహకరిస్తుంది.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp