Zodiac Signs : అక్టోబర్ 06 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 5 October 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : ఈరోజంతా బిజీగా గడిచిపోతుంది. ఇబ్బందులు కలిగినా వాటిని అధిగమిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. ప్రశాంతత లభిస్తుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. శ్రీ శివారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆఫీస్లో కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. పెద్దల సలహాలతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రీ అన్నపూర్ణ అష్టకం పారాయణం చేసుకోండి.

మిథునరాశి ఫలాలు ; వ్యాపారాలు విస్తరిస్తారు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం. వ్యయప్రయాసలు. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. శ్రీలలితా సహస్రనామ పారాయణం చేయండి.కర్కాటకరాశి ఫలాలు : ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆఫీస్లో అన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో విభేదాలు. ప్రముఖులతో పరిచయాలు. శ్రీరామాలయంలో ప్రదక్షణలు చేయండి.

today horoscope october 062022 check your zodiac signs

today horoscope october 062022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : వైవాహిక బంధం బలపడుతుంది. నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండానే పనులు పూర్తవుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులకు మంచి రోజు. ముఖ్యవిషయాలు చర్చిస్తారు. భూవివాదాల పరిష్కారం. శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. విద్యార్థులు చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు. ముఖ్యమైన పనుల కోసం ప్రయాణాలు చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

తులా రాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. వాహనయోగం. చికాకులు తొలగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. శ్రమ ఫలిస్తుంది. నవరత్నమాలికా స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృశ్చికరాశి ఫలాలు : మీరు చేయాలనుకున్న పనులన్నీ ఈరోజు పూర్తి అయిపోతాయి. ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది. పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

ధనుస్సురాశి ఫలాలు
కుటుంబంలో వ్యయప్రయాసలు, ఒత్తిడులు. ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. కొన్ని విషయాలలో మీరు మొండిపట్టుని విడనాడాల్సి ఉంటుంది. ఆసక్తికరమైన సమాచారం. శ్రీకాలభైరవాష్టకం పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు ఆభరణాలు కొంటారు. రాబోయే రోజులు మంచిగా గడుస్తాయి. ఈరోజు మీ వైవాహిక జీవితం బాగుంటుంది. సమాజ సేవ చేస్తారు. ఆర్థికంగా సంతోషమైన రోజు. వ్యక్తిగతంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

కుంభరాశి ఫలాలు : బంధువులతో మాటపట్టింపులు. మీరు చేసే ఆలోచనలు స్థిరంగా ఉండవు. వత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. తోటిఉద్యోగుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివకవచం పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు : ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో గొప్ప అవకాశాలు కలుగుతాయి. శుభవార్తలు వింటారు. చిక్కులు తొలగుతాయి. సోదరుల కలయిక. ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. వైవాహిక బంధం బలపడుతుంది. శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. సూర్యారాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp