Zodiac Signs : అక్టోబర్ 10 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 9 October 2022, 10:40 pm

మేష రాశి ఫలాలు : చక్కటి రోజు. అనుకోని లాబాలు వస్తాయి. మీరు ఇంట్లో కొత్త పనులను ప్రారంభిస్తారు. అందరి నుంచి సహకారం లభిస్తుంది. ఆఫీస్లో మంచి రోజు. మహిళలకు ధనలాభాలు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాదన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు ఆదాయపరంగా చక్కటి పురోగతి కనిపిస్తుంది. ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలుగుతాయి. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. అన్నింటా జయం సాధిస్తారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : వివాదాలకు అవకాశం ఉంది. ఆర్థికంగా సాధారణ స్తితి. వ్యాపరాలలో ఇబ్బందులు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళన. విద్యార్థులకు శ్రమ ఎక్కువతుంది. ఆఫీస్‌లో కొద్దిగా పనిభారం పెరుగుతుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : పనులను సకాలంలో పూర్తిచే స్తారు. విద్యా, ఉద్యోగ విషయాలలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. ఆనుకోని ధనలాభాలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు చక్కటి రోజు. అన్ని రంగాల వారికి ఇబ్బందులు తొలిగిపోయి మంచి జరుగుతుంది.శ్రీ శివాభిషేకం చేయండి.

Today Horoscope october 10 2022 Check Your Zodiac Signs

Today Horoscope october 10 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూలమైన రోజు. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో నష్టాలు రావచ్చు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆఫీస్లో పక్కవారితో ఇబ్బందులు. విలువైన వస్తువులు జాగ్రత్త. శ్రీ రుద్రాభిషేకం చేయించండి.

కన్యరాశి ఫలాలు : కొద్దిగా మంచి, కొద్దిగా చెడుతో కూడిన రోజు. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో మాత్రం స్వల్ప లాభాలు వస్తాయి. ప్రయాణ సూచన. అనుకోని శుభవార్తలు వింటారు. పిల్లల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. విద్యార్తులకు శుభవార్తలు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

తుల రాశి ఫలాలు ; ఈరోజు కొంత ఇబ్బంది పడ్డా చివరకు అంతా సర్దుకుంటుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. అవసరానికి మాత్రం ధనం చేతికి అందుతుంది. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాల్సిన రోజు. ఓపికతో ఉంటే విజయాలు మీ సొంతం. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. విదేశీ వ్యవహారాలలో సానుకూలత పెరుగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. మహిళలకు మంచి రోజు. శ్రీ మల్లికార్జునస్వామి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : అన్నింటా సాధారణంగా ఉంటుంది. ఆఫీస్‌లో పదోన్నతులు వస్తాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పెట్టుబడులకు అనుకూలం. మంచి వార్తలు వింటారు. ఇష్టదేవతరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందిపడే రోజు. విద్యార్థులకు శ్రమిస్తేనే ఫలితం వస్తుంది. ఆదాయం తగ్గుతుంది. కానీ అవసరాలకు మాత్రం ధనం అందుతుంది. అనుకోని వివాదాలకు అవకాశం ఉంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. మహిళలకు పనిభారం. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొద్దిగా మంచి జరిగేరోజు. ఆదాయంలో వృద్ది కనిపిస్తుంది. ఆస్తి సంబంధ విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. నిర్లక్ష్యం వదులుకోవాల్సిన రోజు లేకుంటే విలువైన అవకాశాలను కోల్పోతారు. పనలు వాయిదా పడుతాయి. అమ్మవారికి కుంకుమార్చన చేయించండి.

మీన రాశి ఫలాలు : పాత బాకీలు వసూలు అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. అన్నింటా సానుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం. సంతోషం. ఆనందంతో కూడిన రోజు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ రామ తారకాన్ని కనీసం 108 సార్లు జపించండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  2. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  3. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  4. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  5. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  6. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  7. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి