Zodiac Signs : అక్టోబర్ 13 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : అక్టోబర్ 13 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By prabhas | The Telugu News | Updated on :12 October 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. ధన యోగం కలుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఈరోజు తోబుట్టువులతో కలిసిమెలిసి ఉంటారు. శ్రీ కనకధారా స్తోత్ర పారాయణ చేసుకోండి. వృషభ రాశి ఫలాలు : కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. తొందరపాటు తనం వల్ల వాగ్వాదాలు. పెట్టుబడులు అనుకూలిస్తాయి. బంధువులకు రుణాలు ఇవ్వకండి. అధిక ధనలాభం కలుగుతుంది. శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

మిధున రాశి ఫలాలు : ఈరోజు మీరు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల వల్ల ఇబ్బందులు పడుతారు. అనారోగ్య సూచనలు. ప్రారంభించిన పనులు, చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. సోదరులతో విభేదాలు. అమ్మవారి నామం ‘శ్రీ మాత్రేనమః’ను మనసులో జపించండి. కర్కాటక రాశి ఫలాలు : పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆర్థిక లాభం కలుగుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బిజీగా ఉంటారు. పాతబాకీలు వసూలవుతాయి. శ్రీ కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

Today Horoscope october 13 2022 Check Your Zodiac Signs

Today Horoscope october 13 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టపోతారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మనోవేదనకు గురవుతారు. రుణాలు తీసుకునేటపుడు జాగ్రత్త. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

కన్య రాశి ఫలాలు : వ్యాపారాలు అనుకూలించవు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం జాగ్రత్త. వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త. సోదరులతో విభేదాలు. రుణ బాధలు పెరుగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

తులా రాశి ఫలాలు : సమాజ సేవ చేస్తారు.పారాలు లాభిస్తాయి. నూతన పథకాలను ప్రారంభించడానికి మంచిరోజు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అధిక ధనలాభం కలుగుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ఆదిత్య పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. రాబోయే రోజులు మంచిగా గడుస్తాయి. పిల్లల వైపు నుంచి మీరు శుభ వార్తలు వింటారు. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. చిక్కులు అధిగిస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతారు. భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి ఫలాలు : గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు, మద్దతుతో మీరు పూర్తి చేయాల్సిన పనులను సరైన క్రమంలో పూర్తి చేస్తారు. చిక్కులు అధిగిస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. పోటీ పరీక్షల్లో రాణిస్తారు.

మకర రాశి ఫలాలు : మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం జాగ్రత్త. తోబుట్టువులతో కలిసిమెలిసి ఉంటారు. పనులలో అవాంతరాలు. పనులలో అవాంతరాలు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శ్రీకాలభైరవాష్టకం పారాయణం చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. మిత్రుల రాక సంతోషాన్ని కల్పిస్తుంది. ఈరోజు అన్నపూర్ణా దేవిని ఆరాధించండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు అనుకూలంగా లేదు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం జాగ్రత్త. మానసిక వేదన పడతారు. గృహాన్ని కొనుగోలు చేస్తారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది