Zodiac Signs : అక్టోబర్ 17 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 16 October 2022, 10:40 pm

మేష రాశి ఫలాలు : కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సఖ్యతగా ఉంటారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. గతంలో విడిపోయిన భార్య భర్తలు తిరిగే కలుసుకుంటారు. ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి. వృషభ రాశి ఫలాలు : వ్యసనాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాలను రహస్యంగా ఉంచకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఏర్పడతాయి. మొండితనం వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. శ్రీ శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మిధున రాశి ఫలాలు : చేపట్టిన పనులు వాయిదా పడతాయి. విద్యార్థులు స్నేహితుల వల్ల చదువును నిర్లక్ష్యం చేస్తారు. స్త్రీలకు పని ఒత్తిడి అధికమై ప్రశాంతత కోల్పోతారు. అప్పుల బాధలు పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు అధికమవుతాయి. వచ్చిన అవకాశాలను వదులుకుంటారు. శ్రీ రామ నామ పారాయణం చేసుకోండి. కర్కాటక రాశి ఫలాలు : బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కార్యాలయంలో పదోన్నతులు పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. శివ కవచ స్తోత్ర పారాయణం చేసుకోండి.

Today Horoscope October 17 2022 Check Your Zodiac Signs

Today Horoscope October 17 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మనోవేదనకు గురవుతారు. సోదర సోదరీమణులతో సఖ్యతగా ఉంటారు. ఖర్చులు అధికమవుతాయి. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. శ్రమ ఎక్కువ అవుతుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

కన్య రాశి ఫలాలు : ఆస్తి సంబంధవిషయాలలో అనుకూలత కనిపిస్తుంది. బంధువుల ద్వారా చెడు వార్తలు వింటారు. మిత్రుల నుంచి సహాయం అందక నిరాశ పడుతారు. షేర్‌, ట్రేడింగ్‌ విషయాలలో అనకూలత తక్కువగా ఉంటుంది. వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : సమాజంలో గౌరవం పెరుగుతుంది. అన్ని రకాల పనులు సానుకూలంగా సాగుతాయి. అన్నదమ్ముల నుంచి మంచి సహకారం అందుతుంది. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు గట్టెక్కుతారు. అమ్మవారి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఉమ్మడి పెట్టుబడులకు అనుకూలం కాదు. తెలియని శత్రువుల ద్వారా ఇబ్బందులు పడుతారు. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. చేసే పనులలో వేగం తగ్గుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇష్టదేవతారాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. అనుకోని లాభాలు వస్తాయి. ప్రేమికులకు మంచి రోజు. కుటుంబంలో సమస్యలు వస్తాయి కానీ ధైర్యంతో ముందుకు పోతారు. అన్నదమ్ముల నుంచి మంచి సహకారం అందుతుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : మహిళలకు సాధారణంగా ఉంటుంది. అనుకోని నష్టాలు వస్తాయి. చిన్న చిన్న సమ్యలు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. పనిభారం పెరుగుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు. శివకవచం చదువుకోండి లేదా దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

కుంభ రాశి ఫలాలు : విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం సంబంధించి సంతోషకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. కొత్త వస్తువులు, బంగారు నగలు కొనుగోలుకు అవకాశం కనిపిస్తుంది. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : వ్యాపారాలలో లాభాలు గడిస్తాయి. శుభకార్య యోచన. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రశాంత వాతావరణం ఉంటుంది. అమ్మనాన్నల నుంచి ఆర్థిక లాభాలు అందుతాయి. మహిళలకు స్వర్ణలాభాలు, విందులు, వినోదాలు. శ్రీ లక్ష్మీ ఆరాధన చేయండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  2. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  3. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  4. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  5. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  6. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  7. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి