Zodiac Signs : అక్టోబర్ 31 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: October 30, 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు బాగుంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. సమస్యలు తగ్గుతాయి. అన్నదమ్ముల నుంచి పూర్తి సహాయ సహకారాలు వస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు శివుడిని తుమ్మిపూలు, జిల్లేడుతో ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అన్నింటా శుభఫలితాలు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. పనులలో జాప్యం పెరుగుతుంది కానీ ధైర్యంతో దాన్ని అధిగమిస్తారు. సృజనాత్మకతకు ప్రశంసలు అందుకుంటారు. పెద్దల సలహాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. శ్రీ రామ జయరామ జయజయ రామ అనే తారక మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.

మిథునరాశి ఫలాలు : ఈరోజు మీ శ్రమకు తగ్గ ఫలితం రాదు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు వస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. శ్రీ కాలభైరవాష్టం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఆరోగ్యం బాగుంటుంది. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. మహిళలకు చాలా చక్కటి లాభం వస్తుంది. వైవాహిక బంధం మరింత బలపడుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంఆయి. శ్రీఉమామహేశ్వరస్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

Today Horoscope October 31 2022 Check Your Zodiac Signs

Today Horoscope October 31 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : తోబుట్టువులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలలో ఆటంకాలు. సందేహంతో పనులు ప్రారంభించంకండి. శత్రువుల ద్వారా ఇబ్బందులు పడుతారు. అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది. శ్రీ శక్తి గణపతి రాఆధన చేయండి.

కన్యారాశిఫలాలు : కుటుంబంలో వివాదాలు వస్తాయి. అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఆఫీస్‌లో పై అధికారులు మీపై పని వత్తిడిని పెంచుతారు. పక్కవారితో సఖ్యత కోసం ప్రయత్నిస్తారు. ఎదురు దెబ్బలు తిన్నా ముందుకుపోతారు. శ్రీ మారేడుతోశివారాధన మంచి ఫలితం ఇస్తుంది.

తులారాశి ఫలాలు : విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా బహుళ ప్రయోజనాలు పొందుతారు. విందులకు హాజరవుతారు. ఎదురు దెబ్బలు తిన్నా ముందుకుపోతారు. అన్నింటా శుభఫలితాలు సాదిస్తారు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పెద్దపెద్ద పనులకు పూనుకుంటారు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. చికాకులు పెరుగతాయి. అప్పులు తీరుస్తారు. వ్యవహారాలలో లాభాలను పొందుతారు. శ్రీ శివారాధన చేయండి.

ధనస్సురాశి ఫలాలు : విలువైన వస్తువులు, ఆభరణాలు కొంటారు. బ్యాంక్ లావాదేవీల విషయాలు జాగ్రత్తగా వ్యవహరించండి. మీ భాగస్వాముల ద్వారా వ్యాపార ప్రయోజనాలు పొందుతారు. అనవసరమైన ఖర్చులు చేస్తారు. శ్రీ శివకవచం పారాయణం చేయడం.

మకరరాశి ఫలాలు : ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ధనాన్ని పొదుపు చేస్తారు. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. అమ్మ తరుపు వారి నుంచి లాభాలు పొందుతారు. మీ శ్రమకు ఆఫీస్లో ప్రశంసలు వస్తాయి. రుద్రాభిషేకం చేయండి.

కుంభరాశి ఫలాలు : దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతారు. ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారాలలో పెద్దగా లాభాలు కనిపించడం లేదు. ఇంటికి బంధువులు లేదా అతిథులు వస్తారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. శ్రీ శివారాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు ఆనందంగా గడుపుతారు. ప్రియమైన వ్యక్తులు కలిసే అవకాశం ఉంది. చెడు వ్యసనాల నుంచి బయటపడుతారు. ఇంటా, బయటా అనుకూలమైన రోజు. అనుకోని చోట నుంచి శుభవార్తలు. శ్రమించాల్సిన రోజు. శివ స్తోత్రాలను, ధాన్యం చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp