Zodiac Signs : సెప్టెంబర్ 05 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: September 4, 2022, 10:40 pm

మేష రాశి ఫలాలు : ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. విజయాలను సాధిస్తారు. ధనాన్ని ముదుపు చేస్తారు. పనుల ప్రాముఖ్యతను తెలుసుకుని ఆ మార్గంలో ప్రయాణిస్తారు. ఇబ్బందులు తొలిగిపోతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. శ్రీ సోమనాథ స్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనం విలువ తెలుసుకుంటారు. మీ తెలివితేటలకు పదును పెడుతారు. ప్రేమికులకు మంచి రోజు. పెండింగ్‌లో పనులు పూర్తిచేస్తారు. బాగా శ్రమిస్తారు. ధన విషయంలో పురోగతి కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. పనులను వేగంగా పూర్తిచేస్తారు. మీ కోపతాపాలను కొద్దిగా పక్కుకు పెట్టాల్సిన రోజు. కుటుంబ బాధ్యతలు మీ ఆందోళన పెంచేలాగ ఉంటాయి. పెద్దల సలహాలు తీసుకోకుండా ఏ పనిని ప్రారంభించకండి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. శ్రీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా లాభాలను గడిస్తారు. మానసిక ధైర్యంతో ముందుకుపోతారు. పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి లభించదు. సాయంత్రం నుంచి కొద్దిగా సంతోషంగా గడుపుతారు. మిత్రుల సహకారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంబిస్తారు. వైవాహికంగా చక్కటి రోజు. ఇష్టదేవతారధన చేయండి.

Today Horoscope September 05 2022 Check Your Zodiac Signs

Today Horoscope September 05 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు ఉషారుగా ముందుకుపోతారు. వేగంగా స్పందిస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో చక్కటి సఖ్యత పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. మంచి రోజు. విష్ణు ఆరాధన చేయండి.

కన్యా రాశి ఫలాలు ; ఈరోజు పని వత్తిడి పెరుగుతుంది. అనుకోని చోట నుంచి చెడు వార్తలు వింటారు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. వివాదాలకు అవకాశం ఉంది. అనుకోని కానుకలు, బహుమతులు అందుతాయి. సాయంత్రంలో మీరు రిలాక్స్ అవుతారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు అందుతాయి. వైవాహిక జీవితానికి సంబంధించి చెడు వార్తలు వింటారు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

తులా రాశి ఫలాలు : ఈరోజు మీకు పరీక్ష ఉంటుంది. ఆలోచనలు పెరుగుతాయి. అన్ని రకాల వృత్తుల వారికి ఈరోజు బాగా శ్రమించాల్సిన రోజు. ఏకాగ్రతతో పనిచేస్తేనే మంచి ఫలితాలను సాధించగలరు. ప్రేమ విషయంలో ఇబ్బందులు. తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. వివాదాలు. ఈ రోజు ఆఫీసులో జాగ్రత్తగా వ్యవహరించండి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు ; ఈరోజు మిశ్రమ ఫలితలను అందుకుంటారు. గతంలో చేసిన అప్పులను తీరుస్తారు. వివాదాలను పరిష్కరం దిశగా ముందుకుపోతారు. ఇంట్లో సాఫీగా జీవితం గడిచిపోతుంది. కుటుంబ సభ్యులను సులువుగా సంతోషపెడుతారు. విద్యార్థులకు మంచి రోజు. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేస్తారు.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు ధనం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరాలకు ధనం చేతికి అందక ఇబ్బంది పడుతారు. పని వత్తిడి పెరుగుతుంది. అనుకోని ఆందోళనలు మనస్సులో వస్తాయి. ప్రయాణ సూచన. కష్టపడాల్సిన రోజు. శ్రీ శివారాధన చేయండి.

మకర రాశి ఫలాలు : సరదా, సంతోషం నిండిన రోజు. ధనం కోసం కొత్త పనులను చేస్తారు. అనుకోని వారి నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. మంచి వార్తలు వింటారు. ప్రేమను మిస్ అయిపోతారు. జీవిత భాగస్వామితో గొడవలు తీరుతాయి. అమ్మవారి ఆరాధన చేయండి

కుంభ రాశి ఫలాలు : దూర ప్రాంతం నుంచి బంధవుల రాక. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీ వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. అనుకోని నష్టాలు రావచ్చు. వివాదాల పరిష్కారం కాక మనస్సుకు చికాకులు ఆర్థికంగా ఇబ్బంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభకరమైన రోజు. అరోగ్య బాగుంటుంది. అన్నదమ్ముల నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు వ్యాపారులకు ప్రయోజనకరమైన రోజు. క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఆఫీసులో అద్భుతమైన రోజులా కన్పిస్తోంది. భాగస్వామితో కీలకమైన విషయాలు మాట్లాడే అవకాశం ఉంది. శ్రీ శివకవచం పారాయణ చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp