Zodiac Signs : సెప్టెంబర్ 06 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: September 5, 2022, 10:40 pm

మేషరాశి : వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మికత ఆలోచనుల పెరుగుతాయి. కుటుంబంలో సానుకూల మార్పులు. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శివాష్టకం పారాయణం చేయండి. వృషభరాశి : స్నేహితుల సహకారం లబిస్తుంది. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. పెద్దల ద్వారా శుభవార్తలు వింటారు. అన్నిచోట్ల అనుకూలంగా ఉంటుంది. శ్రీసరస్వతీ దేవి ఆరాధన చేయండి.

మిధునరాశి : వ్యాపారం కోసం వేసుకున్న ప్రణాళిక మీకు దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితం బిజీగా గడుస్తుంది. గణపతి ఆరాధన చేయండి. కర్కాటకరాశి :  కుటుంబంలో సంతోష వాతావరణం. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. మీ సృజనాత్మకతకు ఈరోజు గుర్తింపు లభిస్తుంది. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

Today Horoscope September 06 2022 Check Your Zodiac Signs

Today Horoscope September 06 2022 Check Your Zodiac Signs

సింహరాశి : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో చిన్నచిన్న ఇబ్బందులు కలుగుతాయి. శ్రమ పెరుగుతుంది. తోబుట్టువుల సాయం అందుతుంది. శ్రీమంగళపార్వతీ స్తోత్రం పారాయణం చేయండి.

కన్యరాశి : అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. ఈరోజు ఆర్ధిక సమస్యలను ఎదుర్కుంటారు. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. శ్రీఆంజనేయ దండకాన్నిపారాయణం చేసుకోండి.

తులారాశి : కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. పనిఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సహముగా పనిచేస్తారు. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు. నవగ్రహలకు ప్రదక్షనలు చేయండి.

వృశ్చిక రాశి : ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులకు డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం అనుకూలించదు. విద్యార్థులు చదువు విషయంలో అశ్రద్ధ చూపడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. శ్రీశివ, గణపతి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి : ఈరోజు సంతృప్తి కరంగా గడుస్తుంది. గతంలో పోగొట్టుకున్న డబ్బులను, ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. శుభకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మెప్పు పొందుతారు. శ్రీపార్వతీ ఆరాధన చేయండి.

మకర రాశి ; ఎదుటి వారు చెప్పిన మాటలు వినడం వల్ల నష్టపోతారు. కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో తగాదాలు. లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

కుంభ రాశి : వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. శ్రీరామ నామ పారాయణం చేసుకోండి.

మీన రాశి : అప్పుల బాధలు తీరిపోతాయి. శ్రమ పెరుగుతుంది. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీ సుబ్రమణ్య భుజంగాన్ని పారాయణం చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp