Zodiac Signs : సెప్టెంబర్ 13 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : సెప్టెంబర్ 13 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By prabhas | The Telugu News | Updated on :12 September 2022,10:40 pm

మేషం రాశి ఫలాలు : ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం. భవిష్యత్‌కు సంబంధించిన ప్లాన్‌లు వేసుకుంటారు. మంచి వార్తలు వింటారు. చాలా కాలంగా ఉన్న సమస్యలు, ఆస్థి వివాదాలకు పరిష్కారం అవుతాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వాహన యోగం. నవగ్రహారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా శ్రమ పెరుగుతుంది. ఆశించిన మేర పనులు పూర్తికావు కానీ ఎంతోకొంత సఫలం అవుతారు. ఆదాయం తగ్గుతుంది. ఇంటా, బయటా అనుకోని మార్పులు జరుగుతాయి. ఇంటికి సంబంధించి జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఈరోజు మీకు ఎదురైన సవాళ్లను అధిగమిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఇష్టదేవతరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి,. ఆదాయం తగ్గిన సమయానికి ధనం చేతికి అందుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మిత్రుల కలయిక. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. అంతటా మీకు అనుకూలంగా ఉంటుంది. లాభాలు. మహిళలకు శుభవార్తలు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు పనులు కొద్దిగా నిదానంగా సాగుతాయి. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేసిస్తారు. అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్య సమస్యలు. చికాకులు పెరుగుతాయి. పిల్లల వల్ల ఇబ్బందులు. వ్యాపారాలలో నష్టాలు రావచ్చు. ప్రయాణ చికాకులు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

Today Horoscope September 13 2022 Check Your Zodiac Signs

Today Horoscope September 13 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు మీ ఆర్థిక పరిస్థతి అనుకూలంగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. ఇంటికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వస్తువులు, ఆభరణాలు కొంటారు. చాలా కాలంగా ఉన్న పెండింగ్‌ పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.ఆకస్మిక ప్రయాణాలు. గోసేవతోపాటు నవగ్రహారాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అనుకోని వివాదాలు వస్తాయి. వ్యాపారాలు మాత్రం పర్వాలేదు అనిపిస్తాయి. స్వల్ప లాభాలు. ఈరోజు సమాజ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. అవసరాలకు డబ్బు లభిస్తుంది. శ్రీ లక్ష్మీ నారాయణ ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు కొత్త విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. కుటుంబ సమస్యలు పరిస్కరించుకుంటారు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.అన్ని రకాల వృత్తుల వారికి అభివృద్ధి.శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలలో అటంకాలు ఏర్పడిన అధిగమిస్తారు. కొత్త పనులు లేదా ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలలో స్వల్ప లాభం. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. అన్ని రకాల వృత్తుల వారికి లాభాలు. ప్రయాణ చికాకులు. ఆటంకాలతో రోజు గడుస్తుంది. శ్రీ లక్ష్మీ ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలమైన వాతావారణం ఉంటుంది. ఆర్థిక మందగమనం. అనుకున్న పనులు పూర్తిచేయలేరు. వ్యాపారాలలో నష్టాలు. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో మనస్పర్థలు. విశ్రాంతి లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి. మహిళలకు దూర ప్రయాణ సూచన. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయిచండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు అన్ని విషయాలలో లాభసాటిగా ఉంటాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ధైర్యంతో మీరు ముందడుగు వేస్తారు. విద్యార్థులు, వ్యాపారులు చేసే పనులలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంటా, బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు ; ఆటంకాలతో ఈరోజు ప్రారంభం అవుతుంది. అన్నింటా ఇబ్బందులు కానీ ధైర్యంతో ముందుకుపోతారు. అవసరాలకు పెద్దల సహకారంతో మందుకుపోతారు. విందులు, వినోదాలు, అవసరాల కోసం ధనాన్ని అప్పు చేస్తారు. మహిళలకు పనిభారం. విశ్రాంతి లబించదు. అమ్మవారి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : ఆర్థికంగా బాగుంటుంది. అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. ఆస్తి సంబంధ విషయాలలో ఇబ్బందులు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వారి పరిచయం. సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాదలు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. మహిళలకు ధనలాభాలు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది