Zodiac Signs : సెప్టెంబర్ 14 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేష రాశి ఫలాలు : ఈరోజు కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యం బాగుండదు. మిత్రుల వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. ఆదాయం కోసం బాగా కష్టపడాలి. మీ ధైర్యం మీకు రక్ష ఈరోజు. అనుకోని మార్పులు సంభవిస్తాయి. వివాదాల వల్ల మీ మూడ్ మొత్తము చెడిపోతుంది. వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అత్యుత్తమమైన రోజు. సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. అన్ని రంగాల వారికి అభివృద్ధి కానవస్తుంది. ఈరోజు దుబారా ఖర్చులు మానండి. వైవాహిక జీవితంలో కొంత సంతోషం ఉంటుంది. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు ; ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి మంచి వార్తలు వింటారు. ఆందోళనలు తగ్గుతాయి. ఆదాయం తగ్గుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారికి ఈరోజు నష్టాలు. పెట్టుబడుల విషయంలో జాగురూకతతో వ్యవహరించటం మంచిది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు, నిదానంగానైనా పూర్తిచేస్తారు. మహిళలకు మంచి ఫలితాలు వస్తాయి. ఇష్టదేవతారాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఇబ్బందులు వస్తాయి. ఆదాయం కోసం బాగా కష్టపడాలి. మిత్రుల సహాయంతో ఆర్థిక నిరాశ స్తితి నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు సాఫీగా సాగవు. వివాదాలకు అవకాశం ఉంది. ప్రయాణ చికాకులు. మహిళలకు మాటపట్టింపులు వస్తాయి. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

Today Horoscope September 14 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు మీ తెలివితేటలతో ముందుకుపోతారు. అనవసర ఖర్చులు వస్తాయి. ధనం సంపాదిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. పొదుపు చేస్తారు. ప్రయాణ సూచన. ప్రేమికుల మధ్య మంచి సఖ్యత. ఆనుకోని వారి నుంచి లాభాలు కలుగుతాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు అప్పులు తీసుకోకండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. అనారోగ్యం సూచన. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరిచండి. అనుకోని పరిస్థితులు ఏర్పడుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కష్టపడుతారు. జీవిత భాగస్వామితో వివాదాలు వస్తాయి. మంచి చేద్దామన్న ఇబ్బంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

తులా రాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా ముందుకుపోతారు. ఉల్లాసం ఉత్సాహం పెరగుతుంది. అన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయం కోసం చేసేప్రయత్నాలు సఫలం అవుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆనందంగా ఉండటానికి భవిష్యత్‌లో ప్లాన్‌ చేస్తారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు మీ ఆశయసాధనకు ముందుకుపోతారు. విశ్వసంతో ముందుకుపోతారు. సానుకూలమైన వాతావరణం. విద్యార్థులకు శుభవార్తలు. ప్రతి విషయంలో ఈరోజు ఆచితూచి వ్యవహరిస్తారు. అన్నదమ్ముల నుంచి లాభాలు వస్తాయి. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతారాదన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు మంచి ప్రయోజనకరమైన రోజు. అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు. ఆర్ధికంగా బాగుంటారు.. ప్రముఖులతోను పరిచయాలు కలుగుతాయి.ఆఫీస్‌లో ఇబ్బందులు వస్తాయి. మంచి ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. చివరకు అంతా సర్దుకుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : అనందంగా గడుపుతారు. అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. ఆర్థిక లబ్ది కలుగుతుంది. కష్టపడి పని చెయ్యడం వల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఉపాధి, వృత్తుల వారికి ఈరోజు సంతృప్తికరంగా ఉండగలదు. అన్ని రకాలుగా బాగుంటుంది. ఇష్టదేవతారాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : ఈరోజు మంచి ఉత్సాహంతో ముందుకుపోతారు. చేసే పనులను సకాలంలో పూర్తిచేసేస్తారు. ఈరోజు కష్టపడితే తప్పకుండా మంచి ఉద్యోగము లేదా ఉపాధి అవకాశం వస్తుంది. ఈరోజు మీకు కష్టపడితేనే మీకు ఫలితము ఉంటుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది. మహిళలకు లాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమం ఫలితం వస్తుంది. అన్నింటా చికాకులు వస్తాయి కానీ రోజు గడిచే కొద్ది మీరు సమస్యలు, చికాకుల నుంచి బయటపడుతారు. ఆదాయం తగ్గినా అవసరానికి మాత్రం ధనం చేతికి అందుతుంది. అనుకోని లాభాలు వస్తాయి. వ్యాపారాలలో అనుకోని లాభాలు వస్తాయి. మహిళలకు చక్కటి శుభదినం. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

Share

Recent Posts

Sleep Tips : మీకు నిద్ర పట్టడం లేదా… అయితే, దిండు కింద ఇవి పెట్టుకోండి… క్షణాల్లో నిద్ర పడుతుంది..?

Sleep Tips : ప్రస్తుత కాలంలో చాలామంది కూడా తమ ఈ లైఫ్ లో ఒత్తిళ్ల వల్ల నిద్రకు భంగం…

47 minutes ago

Cardamom : కేవలం 10 రోజుల్లో…ఈ చిన్న విత్తనం మీ బొడ్డు కొవ్వును కరిగించి వేస్తుంది…?

Cardamom : సాధారణంగా ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులలో ఒకటి యాలకులు. యాలకులు సుగంధ వాసనను…

2 hours ago

SravanaMasam : శ్రావణమాసంలో నాన్ వెజ్ ని ఎందుకు తినకూడదో తెలుసా… అసలు సైంటిఫిక్ రీసన్ ఇదేనట…?

SravanaMasam : రమణ మాసం అంటేనే ఆధ్యాత్మిక తో నిండి ఉంటుంది.అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఒక రకమైన వాతావరణం…

3 hours ago

Numerology : ఈ తేదీల్లో పుట్టిన వారికి… ఎక్కడ అడుగుపెట్టిన డబ్బుకి లోటే ఉండదు…?

Numerology : శాస్త్రం ప్రకారం గ్రహాలను బట్టి జాతకాలను అంచనా వేస్తారు అలాగే సంకేయ శాస్త్రం కూడా పుట్టిన తేదీలను…

4 hours ago

New Scheme : ఆగస్టు 1 నుంచి కొత్త ఉద్యోగ పథకం అమలు .. లక్ష్యంగా 3.5 కోట్ల ఉద్యోగాలు!

New Scheme : దేశ వ్యాప్తంగా యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం…

5 hours ago

Varalakshmi Vratham 2025 : శ్రావణమాసంలో వరలక్ష్మీ పూజ ఇలా చేయండి… అష్టైశ్వర్యాలతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం…?

Varalakshmi Vratham 2025 : శ్రావణమాసం వచ్చిందంటే పండుగల వాతావరణం నెలకొంటుంది. ఆ మాసమంతా కూడా అందరూ ఆధ్యాత్మికతతో నుండి…

6 hours ago

UPI : అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్ .. ఎప్ప‌టి నుండి అంటే..!

UPI : యూపీఐ చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కొత్తగా ప్రకటించిన రూల్స్ ఎప్ప‌టి…

14 hours ago

Pension : గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు

Pension : తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు తీసుకొచ్చింది. ఈ నెల 29వ తేదీ నుంచి…

17 hours ago