Zodiac Signs : సెప్టెంబర్ 2 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By aruna | The Telugu News | Published on: September 1, 2022, 10:40 pm

మేష రాశి ఫలాలు : కొత్త అవకాశాలు వస్తాయి. ఈరోజు మీరు చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారాలలో సాధారణ స్తితి. అమ్మవారి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకోని వారి నుంచి నష్టాలు వస్తాయి. ఆర్థిక మందగమనం. ప్రయాణ సూచన. ఇంటా, బయటా పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. సాయంత్రం నుంచి వ్యాపారాలలో లాభాలు వస్తాయి. స్థిరాస్థి సంబంధ వివాదాలకు అవకాశం ఉంది. శ్రీ దుర్గాదేవి ఆరాదన చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు కొంచెం సుఖం, కొంచెం కష్టంతో కూడిన రోజు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. చేసే వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. పిల్లల వల్ల సంతోషం లభిస్తుంది. ఇష్టదేవతరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అన్ని రకాలుగా పర్వాలేదు అన్నట్లు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా ఉండదు. కానీ అవసరాలు మాత్రం తీరుతాయి. ప్రయాణాలు. మిత్రలతో, బంధువులతో వివాదాలు. అనారోగ్య సూచన. నవగ్రహారాధన చేయండి.

Today Horoscope September 2 2022 Check Your Zodiac Signs

Today Horoscope September 2 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : మీకు చాలా మంచిరోజు. ఆశించిన మేరకు పనులు పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. అన్ని రకాల వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కార్యసిద్ధి. మహిళలకు శుభవర్తాలు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

కన్యారాశి ఫలాలు : అనుకోని చోట నుంచి ప్రయోజనాలు పొందుతారు. పనులు పూర్తిచేస్తారు. అప్పులు తీరుస్తారు. ఆదాయం పెరుగుతుంది కానీ పొదుపు చేయలేరు. అనుకోని అనవసర ఖర్చులు వస్తాయి. కుటుంబంలో సఖ్యత తగ్గుతుంది. మంచి చేద్దామనుకున్నా చెడుగా ఉంటుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : పనులలో జాప్యం పెరుగుతుంది. దూర ప్రాంతం నుంచి అందే వార్తలు ఇబ్బందిపెడుతాయి. నష్టాలకు అవకాశం ఉంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులకు మంచిరోజు కాదు. ప్రయాణ చికాకులు. పనిభారం. శ్రీ దుర్గాసూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు మీరు ఆశించిన ఫలితాలను అందుకుంటారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కుటుంబంలో సానుకూలత పెరుగుతుంది. మంచి ఆహారం లభిస్తుంది. విద్యా, ఉపాధి విషయాలు అనుకూలం. అన్నింటా జయం. ఇష్టదేవతరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా శ్రమిస్తే చాలు మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయం తగ్గినా అవసరాలు మాత్రం తీరుతాయి. చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. మంచి సలహాలు తీసుకుని భవిష్యత్‌ప్లాన్‌ చేసుకుంటారు. మహిళలకు లాభాలు. ఇష్టదేవతారాధన చేయండి.

మకర రాశి ఫలాలు : అన్నింటా మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలు మాత్రం పర్వాలేదు అన్నట్లు ఉంటాయి. ప్రయాణ సూచన. విద్యార్థులకు శుభవార్తలు. విందువినోదాలు. చేసే పనులలో పురోభివృద్ధి. మహిళలకు పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. శ్రీ లలితాదేశి, వినాయక స్వామి పూజ చేయండి.

కుంభ రాశి ఫలాలు : అన్నింటా సమస్యలు వస్తాయి. ఆదాయం పెద్దగా రాదు. వ్యాపారాలలో మందకొడి తనం. వివాదాలకు ఆస్కారం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆనారోగ్య సమస్యలు. ఇంటా, బయటా మీకు కొన్ని ఇబ్బందులు. మహిళలకు శ్రమాధిక్యం. శ్రీ వినాయక, పార్వతీ దేవి ఆరాదన చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలోచక్కటి వాతావరణం. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తివివాదాలు పరిష్కారం. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల వల్ల లాభాలు గడిస్తారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. దైవదర్శనాలు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

aruna

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp