Zodiac Signs : సెప్టెంబర్‌ 23 శుక్ర‌వారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేష రాశి ఫలాలు : మీరు అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. బయట కార్యక్రమాలను చక్కటి లాభాలు తెస్తాయి. అనుకోని చోట నుంచి మీకు లాభాలు వస్తాయి. ఉంటాయి. పని వత్తిడి తక్కువగా ఉంటుంది. కుటుంబసభ్యులతో హాయిగా గడపుతారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. గోసేవ చేయండి. వృషభ రాశి  ఫలాలు : పెద్దల మాటలను వినకపోవడం వల్ల ఇబ్బందులు పడుతారు. కొంత ఇబ్బందికరమైన రోజు. అనవసర ఖర్చులు వస్తాయి. ఆదాయం అనుకున్నంతగా ఉండదు. అన్ని రకాల వృత్తుల వారికి సాధారణ స్తితి. ఈరోజు అనవసర వివాదాలకు ఆస్కారం. మహిళలకు పనిభారం, వత్తిడి పెరుగుతుంది. శ్రీ లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలతో అర్చన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : ఈరోజు కొంచెం చికాకుగా ఉంటుంది. అనుకోని ప్రయాణంతో అలసట. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల కనిపిస్తుంది. విలువైన వస్తువులు కొంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకోండి. జీవిత భాగస్వామి ఈ రోజు సర్ ప్రైజ్ ఇస్తారు. ఇష్టదేవతరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : బాగా కష్టపడి పనిచేస్తారు. ఇంటా,బయటా మీపై పని వత్తిడి ఉంటుంది ఈరోజు. గతంలో చేసిన అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. పెండింగ్‌ పనులు పూర్తిచేస్తారు. మీ తోటి ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందుతుంది. మీకు అత్యంత అనుకూలమైన రోజు. అమ్మవారి ఆరాదన చేయండి.

Advertisement
Today Horoscope September 23 2022 Check Your Zodiac Signs
Today Horoscope September 23 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు పెద్దల సహయసహకారాలు మీకు అందుతాయి. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. చేసే పనులను పూర్తిచేస్తారు. మీ జీవిత భాగస్వామి చక్కటి సహకారాన్ని అందిస్తారు. శ్రీ లక్ష్మీ అష్టోతరంతో అమ్మవారిని ఆరాధించండి.

కన్యా రాశి ఫలాలు : చక్కటి ఆత్మవిశ్వాసంతో ముందుకుపోతారు. గతంలో పెట్టుబడుల నుంచి లాభాలు ఆర్జిస్తారు. ధనం సంపాదించడానికి కొత్త ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఉమ్మడి వ్యాపారం ప్రారంభించడానికి మంచి రోజు. ప్రయాణాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు. శ్రీ దుర్గా సూక్తంతో ఆరాధన చేయండి.

తులా రాశి ఫలాలు : ఈరోజు విశ్వాసంతో పనిచేస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు పోతాయి. ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవితపు ఆనందాన్ని పొందుతారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అనుకోని వారి నుంచి చికాకులు పెరుగతాయి. మనోవేదన. ప్రేమికుల మధ్య మనస్పర్థలు. విద్యా, ఉద్యోగ విషయాలలో చికాకలు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : అనుకోని చక్కటి లాభలు వస్తాయి. ఆదాయం వృద్ది అవుతుంది. అన్నదమ్ముల నుంచి మంచి సహకారం అందుతుంది. పెద్దల వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వివాహ ప్రయత్నం సఫలం. శ్రీ లలితాదేవి సహస్రనామాలను వినడం లేదా పారాయన చేయండి.

మకర రాశి ఫలాలు : మీరు గతంలో చేసిన పొదుపు సొమ్ము నేడు ఉపయోగపడుతుంది. అనుకోని చోట నుంచి శుభవార్తలు అందుతాయి. బాగా ఇష్టమైన వారినుండి కాల్ రావడంతో ఎక్సైటింగ్గా ఉంటుంది. ఆఫీసులో తోటి వారి సహకారంతో ముందుకుపోతారు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అమ్మవారి దేవాయలంలో పూజ చేయించండి.

కుంభ రాశి ఫలాలు : ఆర్తికంగా సాధారణ స్తితి. ఈ రోజు ఎవరికి అప్పులు ఇవ్వకండి. తీసుకోకండి. అనుకోని ప్రయాణాలు., వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో మార్పులు. మహాలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : చక్కటి శుభఫలితాలు వస్తాయి. ఇరుగు పొరుగుతో సఖ్యత, సహాయ సహకారాలతో సంతోషం. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం. వాహనాలను జాగ్రత్తగా నడపాలి. విలువైన వస్తువులు జాగ్రత్త. మహిళలకు సంతోషకరమైన రోజు. శ్రీ సరస్వతి, లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Advertisement