Zodiac Signs : సెప్టెంబర్ 25 ఆదివారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేష రాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా పెరుగుతాయి. పనులలో ఆటంకాలు వస్తాయి. వ్యాపారాలలో ఇబ్బందులు. వివాదాలకు దూరంగా ఉండండి. మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ సూర్యారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని లాభాలు రావచ్చు. విలువైన వస్తువులను కొంటారు. కొత్త పరిచయాల వల్ల ప్రయోజనం పెరుగుతుంది. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఆస్తి లాభం పొందుతారు. ప్రయాణాలలో లాభాలు. మహిళలకు చక్కటి సంతోషవార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : పనులు నిదానంగా సాగుతాయి. అన్నదమ్ముల నుంచి సహకారం అందుతాయి. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. మిత్రులతో కలిసి ఆనదంగా గడుపుతారు. కొత్త పరిచయాలు. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన రోజు. మహిళలకు మంచిరోజు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అర్థికంగా చక్కటి లాభదాయకమైన రోజు. ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. చేసే పనులలో విజయం సాధిస్తారు. సమాజ సేవలో చురుకుగా పాల్గొంటారు. ఈరోజు మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటంబంలో మీకు విలువ పెరుగుతుంది. గోసేవ చేయండి.
సింహ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. మంచి చేద్దామనుకున్నా చెడు ఫలితాలు వస్తాయి. ఆర్తికంగా మందగమనం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఆదాయం తగ్గుతుంది కానీ అవసరానికి ధనం చేతికి అందుతుంది. కుటుంబం సబ్యులతో కలసి సంతోషంగా గడుపుతారు. ఆదిత్య హృదయం పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : అనుకోని పరిస్థితలను ధైర్యంగా ఆధిగమిస్తారు. ఆదాయం సాధారణ స్థితి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : పనులలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. విద్య, ఉపాధి విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. ముఖ్యమైన పనులలో పెద్దల సలహాలు తీసుకుంటారు. మార్పులకు అవకాశం ఉంది. ఇష్టదేవతరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులు లేదా కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలలో ఎదురైన సమస్యలు తొలగుతాయి. బయటా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్దికాభివృద్ధి శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు మీరు చేసే పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కానీ అవసరాలకు ధనం చేతికి అందుతుందిముఖ్యమైన నిర్ణయాలను ఈరోజు తీసుకోకండి. వివాదాలకు దూరంగా ఉండాలి. అన్నింటా సాధారణ స్థితి. గోసేవ, అన్నదానం చేయండి.
మకర రాశి ఫలాలు : అన్నింటా జయం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగంగా సాగుతాయి. సాయంత్రం నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణం. కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు పెద్దల సలహాలతో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయం పెరుగుతుంది. మంచి పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. విదేశీ ప్రయాణాలు కలసి వస్తాయి. వ్యాపారాలలో లాభాలు. మీ మాటకు విలువ పెరుగుతుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు ధైర్యంతో ముందుకుపోతారు. మీ తెలివితేటలకు పరీక్షా సమయం. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. అన్నింటా సానుకూలత కనిపిస్తుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు,. విందులు, వినోదాలు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. శ్రీ దుర్గా, సరస్వతి ఆరాధన చేయండి.