Home » Devotional » Today Horoscope September 4 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : సెప్టెంబర్ 4 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
aruna
The Telugu News | Published on: September 3, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : ఈరోజు మీ తెలివితేటలకు పని చేప్తారు. ధైర్యంతో ముందుకుపోతారు. అనుకున్నపనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా పర్వాలేదు. పాత బాకీలు వసూలు అవుతాయి. అన్నింటా సానుకూలత పెరుగుతుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అన్నింటా ఆటంకాలు ఎదురవుతాయి. కానీ ధైర్యంతో ముందుకుపోతారు. సమయాన్ని వృథా చేస్తారు. ఆర్థికంగా మందగమనం. అప్పులు చేయకండి. కొత్త పెట్టుబడులకు అవకాశం లేదు. విద్య, వ్యాపారాలు మామూలుగా ఉంటాయి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. అన్నింటా మంచి వార్తలు వింటారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. మహిళలకు మంచిరోజు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు చెడు ఫలితాలు వచ్చు అవకాశం కనిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. అన్నింటా తీవ్రమైన శ్రమ చేయాల్సి రావచ్చు. కొత్త కొత్త పనులు చేద్దామనుకున్నా అవి ముందరపడవు. మహిళలకు మాటపట్టింపు, మనస్సు అశాంతి. శ్రీ దుర్గాదేవి దగ్గర నిమ్మకాయతో చండీదీపం పెట్టండి.

Today Horoscope September 4 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : ఈరోజు పర్వాలేదు అన్నట్లు ఉంటుంది. కొద్దిగా శ్రమ అనిపిస్తుంది, ఆదాయం మాత్రం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అన్నింటా శ్రమతో కూడిన విజయం లభిస్తుంది. దూరప్రయాణ సూచన. విద్యార్థులకు సాధారణం. మహిళలకు ఇబ్బందులు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్తికంగా నష్టాలు. వ్యాపారాలలో సాధారణ స్తితి. అనుకున్నంత లాభాలు రావు. పనులు మందగమనంలో ఉంటాయి. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. వివాహం కాని వారికి శుభవార్తలు అందే అవకాశం. మహిళలకు లాభాలు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా శ్రమించాలి. పనులు పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. అన్నింటా సానుకూలతలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలో పురోగతి కనిపిస్తుంది. చక్కటి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు పర్వాలేదు అన్నట్లు ఉంటుంది. కొద్దిగా శ్రమతో కూడిన రోజు. వివాదాలు వచ్చినా టీ కప్పులో తుపాన్లా గా పోతాయి. ఇంటా, బయటా అందరి నుంచి సహకారం అందుతుంది. ఆదాయం పెరగుతుంది. వ్యాపారాలు, విద్యార్థులకు మంచి రోజు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు మంచిరోజు. అన్నింటా చికాకులు తొలిగిపోతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. మంచి వార్తలు వింటారు. కొత్త అవకాశాలు వస్తాయి. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ఇష్టదేవతారాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా చికాకుగా ఉంటుంది. శారీరక అలసట. ఆర్థిక మందగమనం. వ్యాపారాలలో చిక్కులు వస్తాయి. బయటా మీకు పరీక్ష పెట్టే సమయంగా ఉంటుంది. అనుకోని వివాదాలు రావచ్చు జాగ్రత్త. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ శివారాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : ఈరోజు సాధారణమైన రోజు. విశ్రాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. దేవాలయాలు, దైవ దర్శనాలు చేస్తారు. ఆదాయం సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలో లాభాలు రాకపోయినా పర్వాలేదు అన్నట్లు ఉంటుంది. అనుకోని పనులతో బిజీగా గడుస్తుంది ఈరోజు. గోసేవ చేయండి.

మీన రాశి ఫలాలు : అనుకోని పనుల ద్వారా లాభాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో ఉమ్మడి వ్యాపారాలకు లాభాలు వస్తాయి. ప్రయాణ సూచన. విద్యా, వివాహం, విదేశీ ప్రయత్నాలు పెద్దగా లాభించవు,. ప్రేమికుల మధ్య మనస్పర్తలు. అనుకోని శ్రమ. అతిథి రాకతో మనసుకు సంతోషం. నవగ్రహారాధన చేయండి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి