Virgo : జులై 18 శ్రావణమాసం నుండి కన్యా రాశి వారికి అదృష్ట లక్ష్మి దేవి తలుపు తట్టబోతోంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virgo : జులై 18 శ్రావణమాసం నుండి కన్యా రాశి వారికి అదృష్ట లక్ష్మి దేవి తలుపు తట్టబోతోంది

 Authored By aruna | The Telugu News | Updated on :18 July 2023,7:00 am

Virgo : 2023 జూలై నెల 18వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ శ్రావణమాసంలో కన్య రాశి వారికి దాదాపు 80 ఏళ్ల తర్వాత అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది. పుట్టించిన ఆ దేవుడు కూడా మీకు దక్కబోయే ఈ అదృష్టాన్ని ఆపలేడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నూటికి నూరు శాతం జరిగేది ఇదే.. మరి కన్య రాశి వారి జీవితంలో ఈ శ్రావణమాసంలో జరగబోయే విశేషమైన ఫలితాలు ఏంటి ఈ శ్రావణమాసంలో చేయాల్సినటువంటి దేవతారాధన విశేషాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యరాశికి చెందుతారు. రాసి చక్రంలో కన్యారాశి ఆరవది. కన్యా రాశి వారు మృదుమదురంగా మాట్లాడుతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఒక ప్రత్యేకమైన నిర్ణయానికి వస్తారు.

తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు.. కన్య రాశి వారు దేన్నీ కూడా అంత సులభంగా వదలరు.. ముఖ్యంగా ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి అనుమానాలు ఇంకా బయట వారికి కనపడనివ్వకుండా దాచుకుంటారు. కన్య రాశిలో అయితే ఆహారం మీద వీరికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. ఎక్కువగా భౌతిక విషయాలు మీద దృష్టి పెడతారు.. అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే పని ప్రారంభిస్తారు. ఒక్కసారి ప్రారంభిస్తే మాత్రం అది పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టరు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కూడా ఈ సమయం చాలా మంచి అవకాశాలను కల్పిస్తుంది.

మీకు మంచి పేరు నమ్మకం ఉంటాయి. ఉద్యోగం లేదా ప్రమోషన్ లో మార్పు కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ శ్రావణమాసంలో మీకది లభిస్తుంది. మీకు ఈ సమయంలో పట్టిందల్లా బంగారం గా మారిపోతుంది. మీకు పట్టే అదృష్టానికి మీ చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు. ఆర్థికంగా మీరు దృఢంగా ఉంటారు. మీ ఉద్యోగం గానీ వ్యాపారం విషయంలో కానీ మీకు తిరిగే ఉండదు. నూతన ఆస్తులు కొంటారు. వాహన యోగం ఉంది. మీ కుటుంబానికి చిరకాల కోరికగా ఉన్నటువంటి సొంతింటి కల నెరవేరబోతుంది. ఉద్యోగంలో మీ పై అధికారులు సహోదయోగ నుంచి నీకు మెరుగైన మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో మీ ప్రయాణం లేదా పరిస్థితుల్లో కొంత మార్పును సూచిస్తారు. ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ మాసం మీకు ఎంతో అదృష్టవంతంగా కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్న కూడా ఈ సమయం మీకు ఎంతగానో బాగుంటుంది.

Virgo from 18th July Shravan month

Virgo from 18th July Shravan month

మీరు కొత్త వెంచర్ ప్రారంభించాలనుకుంటే లేదా భాగస్వామ్యం కలిగి ఉండాలని ఉంటే కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది విద్యార్థులకు ఈ నెలలో సరైన సమయంలో చూపిస్తుంది. ఈ శ్రావణమాసంలో మీరు నిత్యం లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల ఆ లక్ష్మీ కటాక్షం మీకు సర్వదా లభిస్తుంది. ముఖ్యంగా శ్రావణ మంగళవారం, శుక్రవారం నాడు మీరు ఉపవాసం ఉండడం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శని దేవునికి సంబంధించిన పరిహారాలు చేయండి.

ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్యలు ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతారు. ఇక కొత్త బట్టలు ధరించే ముందు వాటిపై కొన్ని చుక్కల గంగాజలం చల్లి ఆ తర్వాత ధరించండి. ఈ శ్రావణమాసం అంతా కూడా మీరు మద్యం మత్తు పానీయాలు మరియు ఇతర మత్తు పదార్థాలను స్వీకరించవద్దు.. నీలం రంగు బట్టలు ధరించడం మానుకోండి..

Advertisement
WhatsApp Group Join Now

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది