Zodiac Signs : ఈ రాశుల‌వారు 2022 కొత్త సంవత్సరంలో ఈ మార్పులు చేసుకుంటే మీ లైఫ్ అద్బుతం..!

Authored By aruna | The Telugu News | Published on: December 24, 2021, 6:15 am

Zodiac Signs : ఆంగ్ల సంవత్సరం 2022 త్వరలో ప్రారంభకానున్నది. అయితే ఆయా రాశుల వారు పండితులు చెప్పే విధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం…   మేషరాశి : పని వత్తిడి, లేదా భారం అనుకోకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. ఇలా చేస్తే మీరు కోరుకునే స్థానానికి చేరుకోవడమే కాకుండా మంచి ఆనందాన్ని సొంతం చేసుకుంటారు. కష్టేఫలి అనే సూక్తి ఈ ఏడాది మేషరాశి వారికి చక్కగా సరిపోతుంది.  వృషభరాశి :  మీరు నిజాయితీకి మారుపేరు అయిన రాశి. మీరు ఆత్మీయులను, దగ్గరి వారిని, ఆఫీస్లో పై అధికారులతో నిజాయితీగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీ భావాలను మనసులో పెట్టుకోకుండా బయటపెట్టడం వల్ల మంచి ఫలితాలు సాధించగలరు.

మిథునరాశి : టైం టేబుల్‌ పక్కా ఫాలో అయితే ఈ ఏడాది మీకు ఆనందం సొంతం. అంతేకాదు శారీరక సౌందర్యం కోసం కూడా కొంత సమయాన్ని తప్పక కేటాయించుకోండి దీనివల్ల బహుళ ప్రయోజనాలు పొందగలుగుతారు.   కర్కాటక రాశి : ఈరాశి వారికి గ్రహగతుల వల్ల కొన్ని ఇబ్బందులు వున్నాయి. వాటిని అధిగమించడానికి స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు (క్రిస్టల్‌ సాల్ట్) వేసుకుని స్నానం చేయండి. దీనివల్ల మీకు రాబోయే బాధలు తప్పక తీరుతాయి.

zodiac signs 2022 predictions use this tips as per astrology

zodiac signs 2022 predictions use this tips as per astrology

సింహరాశి : ఈరాశి వారికి మనస్సు ప్రశాంతత కోసం ఇష్టమైన వాటిని చేయాలి అంటే అవి ధర్మ బద్ధంగా ఉండాలి. ముఖ్యంగా కళలు అంటే నృత్యం, సంగీతం వంటివిచేస్తూ ఉంటే మీకు మంచిగా ఉంటుంది.

కన్యరాశి : ఈ ఏడాది వత్తిడి బాగా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని అధిగమిస్తే మంచి పలితాలు మీ సొంతం దీని కోసం నిత్యం యోగా, ప్రాణాయామం తప్పక క్రమం తప్పకుండా చేయండి.స్వేచ్ఛగా మీ మనసులోని మాటలను చెప్పండి. రిలాక్స్గా ఉండండి.

తులారాశి : ఈరాశి వారికి ఎప్పుడు ఎదుటివారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. పక్క లేదా ఎదుటి వారి కోసం శ్రమిస్తారు. ఈ ఏడాది మీరు మీ కోసం శ్రమిస్తే మంచి ఫలితాలు వస్తాయి

వృశ్చికరాశి : ఈ ఏడాది మీరు అత్యంత సంతోషంగా ఉండాలంటే తప్పక చేయాల్సింది వ్యాయామం, నిత్యం వాకింగ్‌, సైక్లింగ్. దీనివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత లబిస్తుంది అన్నింటా విజయాలు సాధిస్తారు.

ధనుస్సురాశి : మీరు విజయం సాధించాలంటే ఆరోగ్యం తప్పనిసరి. అయితే దీనికి శ్రమతోపాటు విశ్రాంతి కూడా చాలా ముఖ్యం. ఈ ఏడాది మీరు శ్రమకు తగ్గ విశ్రాంతి తీసుకుంటే తప్పనిసరిగా శక్తి పెరిగి మరింత పని చేసి విజాయాలను సొంతం చేసుకుంటారు.

మకరరాశి : విజయాలు సాధించాలంటే పట్టుదల ముఖ్యం. ఈ ఏడాది మీరు అనవసర విషయాల జోలిక వెళ్లకుండా వేరే పనులను పక్కన బెట్టి మీ లక్ష్యం వైపు వెళితే చాలు విజయ కిరీటం మీ సొంతం అవుతుంది.

కుంభరాశి : ఈ ఏడాది ఆశ, నిరాశలకు అవకాశం ఉంది. అయితే మీరు మంచి మనస్సు అంటే ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తే ఉత్సహంగా పనిచేయగలరు. దీనికోసం సంగీతం, ఇష్టమైన సినిమాలను చూడటం వంటివి విశ్రాంతి సమయంలో చేస్తే మంచిది.

మీనరాశి : విజయం సాధించాలంటే క్లారిటీ ఆఫ్ థాట్ చాలా ముఖ్యం. దీని కోసం మనస్సు ప్రశాంతత చాలా అవసరం. దీనికోసం ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా, మెడిటేషన్‌ అంటే ధ్యానం చేయండి. మీరు విజయ మార్గాన తప్పక ప్రయాణిస్తారు.

aruna

No bio available for this author.

  1. "Ysrcp : కడప గడ్డపై వైసీపీకి ఘోర పరాభవం.. ఒక్క నామినేషన్ కూడా పడకపోవడం వెనుక అసలు నిజాలివే..!"

  2. "Rashmika Mandanna : తెలంగాణ కోడలిగా బతుకమ్మ ఆడిన రష్మిక.. నెట్టింట రచ్చ లేపుతున్న నేషనల్ క్రష్ పిక్స్..!"

  3. "Punganur Municipal Elections : పుంగనూరులో తోకముడిచిన పెద్దిరెడ్డి? మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దెబ్బకు వైసీపీ ఖేల్ ఖతం..!"

  4. "Charlotte Telugu Sambaralu 2026 : షార్లెట్‌లో తెలుగు సంబరాలు 2026 ఘనంగా.. మిషిగన్‌లో నాట్స్ కొత్త చాప్టర్ ప్రారంభం"

  5. "NATS : అమెరికా తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం.. సాయి గంగులకు కీలక బాధ్యతలు"

  6. "Flipkart Big Billion Days : రూ.9 వేలలోపు ఫోన్లు.. 5Gపై అదిరే డీల్స్"

  7. "Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌కు అగ్నిపరీక్ష.. ఆ రెండు సినిమాలే ఆమె భవితవ్యాన్ని తేలుస్తాయా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp