Home » Hyderabad » Customers Who Tried To Lift Cylinders
hyderabad

Shakepet : గ్యాస్ సిలిండర్లపై ఉద్రిక్తత .. సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వినియోగదారులు ..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 26, 2026, 4:40 pm
Advertisement

Shakepet : హైదరాబాద్ నగరంలోని ఫిలింనగర్ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్లతో బయలుదేరిన ఒక ఆటోను కొందరు వినియోగదారులు అడ్డుకుని  అనుమతి లేకుండా సిలిండర్లను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. స్థానిక సమాచారం ప్రకారం గ్యాస్ బుక్ చేసినప్పటికీ చాలా రోజులుగా సిలిండర్లు అందకపోవడంతో వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Shakepet : గ్యాస్ సిలిండర్లపై ఉద్రిక్తత .. సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వినియోగదారులు ..!

ఈ నేపథ్యంలో ఏజెన్సీ నుంచి సరఫరా కోసం బయలుదేరిన ఆటోను గమనించిన కొందరు వినియోగదారులు వెంటనే దాన్ని ఆపి తమకు సిలిండర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో వారు స్వయంగా సిలిండర్లు తీసుకెళ్లేందుకు యత్నించారు. ఈ ఘటనను గమనించిన గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వెంటనే స్పందించి స్థానికుల సహకారంతో ఆ వినియోగదారులను అడ్డుకున్నారు. కొంతసేపు అక్కడ వాగ్వాదం చోటుచేసుకున్నప్పటికీ పెద్దగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వినియోగదారులు మాట్లాడుతూ.. గ్యాస్ బుక్ చేసి వారం రోజులకంటే ఎక్కువ సమయం గడిచినా ఇంకా సిలిండర్ రాలేదు.

Advertisement

ఫోన్ చేసినా సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏమి చేయాలి? అని ప్రశ్నించారు. సరఫరాలో జరుగుతున్న ఆలస్యంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు స్పందిస్తూ సరఫరా వ్యవస్థలో కొన్ని సాంకేతిక మరియు లాజిస్టిక్ సమస్యల వల్ల ఆలస్యం జరుగుతోందని తెలిపారు. త్వరలోనే సమస్యను పరిష్కరించి అందరికీ సకాలంలో సిలిండర్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంచాలని వినియోగదారులకు సమయానికి సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

 

 

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి