Categories: hyderabadNews

Puranapanda Srinivas : మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! పురాణపండ శ్రీనివాస్

Advertisement
Published by
Advertisement

హైదరాబాద్ : వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ మహా సమ్మేళన్ కార్యక్రమంలో ఇరవై ఒక్క హనుమాన్ చాలీసా పారాయణల అఖండ కార్యక్రమం పరమ వైభవంగా జరగటంతో టాక్ ఆఫ్ ది ట్విన్ సిటీస్‌గా నిలవడం అనేక ఆలయాల్లో, భక్తమండళ్లలో ఆశ్చర్యకరమైన పవిత్ర చర్చగా దారితీసి మరొక మహోజ్జ్వల ఘట్టానికి దారితీసేందుకు శ్రీకారం చుడుతోంది. నగర ప్రముఖులు, హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సమన్వయకర్తలు చంద్రశేఖర్ గాంధీ, శ్రీమతి జగన్మోహిని, జమలాపురం రాధాకృష్ణల చక్కని సంఘీభావ నిర్మాణాత్మక దక్షతతో ఈ మహాకార్యం దిగ్విజయంగా జరగడంతో భక్తకోటి రసజ్ఞులూ ఒక్కటై వారిపై ప్రశంసలు వర్షన్డం ఆసక్తిదాయకం.

Advertisement

Puranapanda Srinivas : మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! పురాణపండ శ్రీనివాస్

సభాప్రారంభకులు సీనియర్ పాత్రికేయులు, జాతీయవాది రాకా సుధాకర్ రావు తన ప్రసంగంలో… చరిత్రపొడవునా హిందూ సంస్కృతి వైభవ ప్రాభవాలను వివరిస్తూ, వర్తమాన పరిస్థితులలో హిందూధర్మ పరిరక్షణకు యువత నడుం బిగించాలని అనేక ఆసక్తిదాయమైన అంశాలతో పాటు హనుమాన్ చాలీసా విశేషాలతో సభికుల్ని ఆకట్టుకున్నారు. ప్రత్యేక ఆహ్వానితురాలు అహం టాక్స్ అధినేత్రి శ్రీమతి మోనికారెడ్డి మాట్లాడుతూ.. జాతి యావత్తూ హిందూధర్మాన్ని కాపాడుకుంటూ, హిందూ ఐక్యతకు నడుం బిగించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.

Advertisement

Puranapanda Srinivas : వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

Puranapanda Srinivas : మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! పురాణపండ శ్రీనివాస్

ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ కేవలం ఐదు నిమిషాలు మాట్లాడినా అత్యంత ఆసక్తిదాయకంగా, మనోజ్ఞంగా హనుమద్వైభవాన్ని పేర్కొనడం రసజ్ఞుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇంతటి మహా పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం తనకి రావడం పట్ల హనుమంతునికి, నిర్వాహకులకు పురాణపండ ఎంతో వినయంగా కృతజ్ఞతలు తెలిపారు. జీవితాన్ని హనుమ సాధనతో తన్మయింప చేసుకుని అత్యంత ధైర్యంతో ఈతరం మున్ముందుకు కదం తొక్కుతూ సాగాలని పురాణపండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

మైహోం అవతార్ గ్రౌండ్స్‌లో శ్రీమతి జగన్మోహిని పర్యవేక్షణలో సుమారు రెండున్నర గంటల పాటు తులసీదాస్ విరచిత హనుమాన్ చాలీసా పారాయణ ఎంతో భక్తి నిండిన వాతావరణంలో ఇరవై ఒక్క సార్లు సామూహిక పారాయణ కార్యక్రమం జరగడం.. ఆ ప్రాంతంలో పవిత్ర సంచలనం సృష్టించింది. ప్రసన్న గంభీర స్థితిలో జరిగిన ఈ పారాయణ కార్యక్రమంలో సుమారు నాల్గువేలమంది పాల్గొనడం విశేషంగా చెప్పక తప్పదు.

ఆద్యంతం శ్రీ రామానుగ్రహంగా, హనుమన్మయంగా జరిగిన హిందూ మహా సమ్మేళన్ కార్యక్రమంలో పురాణపండ శ్రీనివాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పలువురు యువతీ యువకులు సెల్ఫీలు దిగడం మీడియా కంట పడటం మరొక ప్రత్యేక విశేషంగానే పేర్కొనాలి.

పురాణపండ శ్రీనివాస్ నిస్వార్ధ సేవ గురించీ, అద్భుత ఆధ్యాత్మిక రచనల గురించీ పలువురు ప్రస్తావించడం గమనార్హం. మైహోమ్ అవతార్ చరిత్రలో మైలురాయిలా నిలిచేలా ఇంతటి మహోత్తమ కార్యాన్ని అద్భుతంగా నిర్వహించడంలో ఎంతో కష్టపడిన దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్ గాంధీ, శ్రీమతి జగన్మోహిని, జమలాపురం రాధాకృష్ణలను అనేకమంది అభినందించడం స్పష్టంగా కనిపించింది.

 

భాగ్యనగరంలో ఇటీవల జరిగిన హిందూ మహా సమ్మేళన్ భక్తికార్యక్రమాల్లో ఈ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఒక పతాక స్థాయి విజయమేనని చెప్పాల్సిందే!

 

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Nithya Menen Peddi : జాన్వీ పాత్రపై విమర్శలు.. హీరోయిన్ల గ్లామర్ పై నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు..!

Nithya Menen Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ…

1 hour ago

Heavy Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు..!

Heavy Rains : దేశవ్యాప్తంగా వర్షాకాలం క్రమంగా బలపడుతున్న వేళ, భారత వాతావరణ శాఖ (IMD) కీలక సమాచారం వెల్లడించింది.…

2 hours ago

Samsung Galaxy S25 Ultraపై భారీ ధర తగ్గింపు.. రూ.37 వేల డిస్కౌంట్‌తో ఫ్లాగ్‌షిప్ ఫోన్ సూపర్ డీల్!

Samsung Galaxy S25 Ultra : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి అదిరిపోయే…

3 hours ago

Gas Cylinder Rules : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం కొత్త షాక్.. 30 రోజుల్లో ఈ పని చేయకపోతే కనెక్షన్ రద్దు!

Gas Cylinder Rules : దేశవ్యాప్తంగా కోట్లాది మంది కుటుంబాలు వంట గ్యాస్ కోసం ఎల్పీజీ (LPG) సిలిండర్లపై ఆధారపడుతున్నాయి.…

4 hours ago

Samsung Galaxy A35 5Gపై భారీ ధర తగ్గింపు.. కొనడానికి ఇదే బెస్ట్ టైమ్..!

Samsung Galaxy A35 : స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి శుభవార్త వచ్చింది. కంపెనీకి…

5 hours ago

Railway Train : చారిత్రాత్మక తీర్పు.. రైలు 4 గంటలు ఆలస్యం.. రైల్వేపై పోరాడి రూ.69 వేల పరిహారం గెలుచుకున్న దంపతులు..!

Railway Train : భారతదేశంలో రైళ్లు ఆలస్యంగా నడవడం అనేది సాధారణంగా జరిగే విషయమే. చాలా మంది ప్రయాణికులు ఇలాంటి…

6 hours ago

Doctor : ఆసుపత్రి దారుణం… 100 రూ ఇచ్చి 15 ఏళ్ల బాలికపై డాక్టర్ అత్యాచారం..!

Doctor  : హర్యానాలోని కురుక్షేత్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 15 ఏళ్ల మైనర్ బాలికపై వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు…

8 hours ago

Viral News : పిల్లనిచ్చిన అత్తగారినే పెళ్లాడిన అల్లుడు.. సోషల్ మీడియాలో వైరల్ స్టోరీ.. వీడియో !

Viral News : ప్రేమకు వయసుతో సంబంధం లేదని, బంధుత్వాలకు హద్దులు ఉండవని చెప్పే సంఘటనలు అప్పుడప్పుడు సమాజంలో చర్చనీయాంశంగా…

9 hours ago

Peddi Box Office Collection Day 4 : ‘పెద్ది’ బాక్సాఫీస్ భూకంపం.. 4 రోజుల్లోనే రూ.243 కోట్ల గ్రాస్.. రామ్ చరణ్ మాస్ జాతర!

Peddi Box Office Collection Day 4 : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన…

10 hours ago

Mother : నమ్మలేని ఘోరం.. ప్రియుడి కోసం సొంత బిడ్డను బలి చేసిన తల్లి..!

Mother  : కన్నతల్లి తన పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుందనే మాటను ఈ ఘటన పూర్తిగా తలకిందులు చేసింది.…

11 hours ago

Farmers : రైతుల‌కు వ్య‌వ‌సాయ శాఖ న్యూ రూల్స్‌.. ఇక‌పై ఆధార్ ఉంటే..!

Farmers  : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడం, అవసరానికి…

12 hours ago