Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 11 February 2026, 9:40 pm
  •  చందానగర్ లో రాజ్యాంగ నిర్మాత సాక్షిగా పిరాయిoపు దారులపై శేరిలింగంపల్లి బీ.ఆర్.ఎస్ పార్టీ నిప్పులు...

  •  పదవుల కోసం విలువలు తాకట్టు.. స్వలాభం కోసం డివిజన్ల తాకట్టు..

  •  నాడు అధికారంలో ఉన్న కారులో షికారు.. నేడు అధికారం లో ఉన్న చేతిలో చేయి

Serilingampalli BRS Party :  శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి, ప్రజాస్వామ్యానికి పునాది అయిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, గెలిపించిన ప్రజలకు, పార్టీకి వెన్నుపోటు పొడిచిన కొంత మంది కార్పొరేటర్ల పాపాలకు నిష్కృతి లేదని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. నేటితో కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ నాయకులు స్థానిక అంబేత్కర్ విగ్రహం వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాజ్యాంగం రాసిన మీ సాక్షిగానే.. రాజ్యాంగ స్ఫూర్తిని చంపేసిన ఫిరాయింపుదారులను ప్రజలు రాబోయే ఎన్నికల్లో తమ ఓటు ద్వారా శిక్షించాలి.

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

 Serilingampalli BRS Party నాడు కారులో షికారు.. నేడు చేతిలో చేయి!

బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి, రెండేళ్లు పదవిని అనుభవించి, తీరా అధికారం మారగానే నైతిక విలువలను వదిలేసి కాంగ్రెస్ గూటికి చేరడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అంబేత్కర్ గారు రాసిన రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం)ను వీరు తుంగలో తొక్కారు. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారడం అంటే.. పరోక్షంగా రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్‌ను అవమానించడమే అని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం స్వలాభం కోసమే ఈ జంపింగ్‌లు జరిగాయని, దీనిని ప్రజలెవరూ హర్షించడం లేదని పేర్కొన్నారు.

 Serilingampalli BRS Party ప్రజా కోర్టులో శిక్ష తప్పదు

అంబేత్కర్ విగ్రహం సాక్షిగా బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించాయి. నేటితో మీ పదవీ కాలం ముగిసింది, రేపటి నుంచి మీరు కూడా ‘మాజీ’ లే, ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తారు? అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించిన ఈ ‘మాజీ’లకు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

పిరాయింపు దారులను డివిజన్ల నుంచి తరిమికొట్టండి

అవకాశవాద రాజకీయాలకు పాల్పడిన వారిని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలివెళ్ళిన వారిని మళ్లీ డివిజన్లలో అడుగుపెట్టనివ్వొద్దు. ఓటు అనే ఆయుధంతో వారికి బుద్ధి చెప్పండి అని బీఆర్ఎస్ నేతలు ప్రజలను కోరారు. ఇలాంటి వారికి టికెట్లు ఇస్తే చిత్తుగా ఓడించేందుకు శేరిలింగంపల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అంబేత్కర్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

ముగిసిన అధికారం.. మిగిలిన అపవాదు

అధికారం శాశ్వతం కాదని, నమ్ముకున్న సిద్ధాంతం, నిలబడ్డ విలువలెప్పుడూ చరిత్రలో నిలిచిపోతాయని, కానీ ఈ ఫిరాయింపు ప్రజాప్రతినిధులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని స్థానిక నేతలు ఎద్దేవా చేశారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp