Inspirational News : ఒక మంచి ఉద్యోగం ఉందనుకోండి. దాన్ని వదిలేస్తామా? కొందరైతే ఆ ఉద్యోగాన్నే రిటైర్ అయ్యేదాకా చేస్తారు. అదే ఉద్యోగంలో రిటైర్ అవుతారు. కానీ కొందరు మాత్రం ఉద్యోగంలో చేరుతారు కానీ.. అస్సలు ఉద్యోగం చేయడమే ఇష్టం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇష్టాలు ఉంటాయి. ఆసక్తులు ఉంటాయి. కొందరు బలవంతం మీద ఉద్యోగం చేస్తుంటారు. మరికొందరు అసలు ఉద్యోగాలే చేయరు. ఏదైనా మంచి బిజినెస్ చేయాలనుకుంటారు. మరికొందరు కొన్నేళ్ల పాటు ఉద్యోగాలు చేసి ఇక తమ వల్ల కాక చివరకు ఏదైనా చిన్నపాటి బిజినెస్ చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తుంటారు.
మరికొందరికి వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ.. వ్యవసాయం చేయడానికి కావాల్సిన రిసోర్సులు ఉండవు. ఎలా చేయాలో తెలియదు. దీంతో ఇష్టం లేకున్నా వేరే రంగంలో ఉంటారు. ఇలా ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది. కానీ.. 35 ఏళ్ల మధు కార్గుండ్ మాత్రం చాలా క్లారిటీతో ఉన్నాడు. తన జీవితంలో ఏం చేయాలో ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాడు. చివరకు తను అనుకున్నదే చేసి సాధించి చూపించాడు. లక్షల జీతం వచ్చే ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలేసి చివరకు రైతు అయ్యాడు. దాదాపు 8 ఏళ్ల పాటు ఇంజనీర్ గా పని చేసిన మధు 2018 లో ఉద్యోగానికి రాజీనామా చేసి తన సొంతూరుకు వెళ్లిపోయాడు.
నేను రైతు కొడుకును. నేను చాలామంది రైతులను చూశానను. పంటలు సరిగ్గా పండలేదని, దిగుబడి రాలేదని, నీళ్లు లేక ఎండిపోవడం.. ఇలా పలు పరిస్థితుల వల్ల పంట నష్టాన్ని చవి చూసిన ఎందరో రైతులను నేను చూశాను. వాళ్లందరికీ నేను నాకు తోచిన సాయం చేయాలనుకున్నాను. అందుకే వాళ్లు చేసే పనినే స్మార్ట్ గా చేసేలా.. ఆదాయం లభించేలా నేను ప్రోత్సాహం అందిస్తున్నాను. అంతే.. అంటూ చెప్పుకొచ్చాడు మధు. ఇంతకీ తను ఏం చేస్తున్నాడు అనే కదా మీ డౌట్. టెంగిన్ అనే ఒక స్టార్టప్ ను బెంగళూరులో ప్రారంభించాడు.
ఈ స్టార్టప్ ద్వారా నెలకు రూ.4 లక్షల వరకు సంపాదిస్తున్నాడు మధు. అలా ఎలా అంటారా? కొబ్బరి చెట్లనే తన ఉపాధిగా మార్చుకున్నాడు. కొబ్బరి చెట్లలో ప్రతి ఒక్కటి విలువైనదే. కొబ్బరి మట్టల దగ్గర్నుంచి కొబ్బరి బోండాం, కొబ్బరి కాయ, లోపల ఉండే కొబ్బరి, దాని షెల్, కొబ్బరి పొట్టు.. ఇలా కొబ్బరి చెట్ల నుంచి చాలా వస్తువులను తయారు చేయొచ్చు. దాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నాడు.సహజసిద్ధంగా తయారు చేసిన కొబ్బరి నూనె, బర్ఫీ, సబ్బులు, క్యాండిల్స్, షుగర్, చిప్స్, షెల్స్, గిన్నెలు తోమే స్క్రబ్బర్.. ఇలా చాలా వస్తువులను కేవలం కొబ్బరి చెట్టు నుంచే తయారు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు.
తన కంపెనీ ద్వారా కొబ్బరి చెట్ల నుంచి వచ్చే దేన్ని కూడా వేస్ట్ కానివ్వకుండా కొబ్బరి రైతులకు అవగాహన కల్పిస్తూ వాటి నుంచి పలు రకాల వస్తువులను తయారు చేయడంలో సాయం చేస్తుంటాడు. ప్రస్తుతం కర్ణాటక, గోవా లాంటి ప్రాంతాల్లో 20 మంది కంటే ఎక్కువ మంది రైతులకు ఉపాధి కల్పిస్తున్నాడు. పలువురు రైతులతో కలిసి వస్తువులను తయారు చేయిస్తున్నాడు.
వ్యవసాయం అనేది దండగ అని ఇక నుంచి ఎవరూ అనకూడదు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు గడించవచ్చు అని నిరూపించేందుకే తాను ఈ రంగాన్ని ఎంచుకున్నట్టు మధు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కొబ్బరిచెట్ల నుంచి మధు ప్రస్తుతం చాలా వస్తువులను తయారు చేయిస్తున్నాడు. ఇంజనీర్ గా ఉన్నప్పుడు ఎంత సంపాదించేవాడో ఇప్పుడు అంతకంటే ఎక్కువ డబ్బులే సంపాదిస్తున్నాడు. పచ్చని ప్రకృతి మధ్య కాంక్రీట్ జంగల్ శబ్ధం లేకుండా ప్రశాంతంగా తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు మధు. 10 మంది రైతులకు సాయ పడుతూ వాళ్లకు తోడ్పాటునందిస్తున్నాడు. కొబ్బరి చెట్టు నుంచి ఎలాంటి వేస్ట్ పోకుండా జీరో వేస్ట్ పద్ధతిలో ప్రతి ఒక్క దాన్ని ఉపయోగించుకొని మధు ఉపాధి కల్పిస్తున్నాడు. అందుకే మధును చూసి కర్ణాటకలోని స్థానికులు తెగ మెచ్చుకుంటున్నారు. ముందు తన తండ్రి కూడా వ్యవసాయంలోకి వద్దని వారించినా.. ఆ తర్వాత మధు ఐడియాను మెచ్చి ఓకే చెప్పడంతో మధు ఇప్పుడు స్థానికంగా గొప్ప రైతుగా ప్రశంసలు అందుకుంటున్నాడు.
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
This website uses cookies.