Categories: Jobs EducationNews

AI Jobs : లక్ష జీతం ఇస్తామన్న దొరకని AI ఉద్యోగులు ..నేర్చుకుంటే లక్షాధికారి కావొచ్చు !!

AI : భారతదేశంలో కృత్రిమ మేధ (ఏఐ) మార్కెట్‌ అత్యంత వేగవంతమైన వృద్ధి దశలో ఉంది. టీమ్‌లీజ్ డిజిటల్ తాజా నివేదిక ప్రకారం, 2025 నాటికి ఏఐ మార్కెట్‌ 45 శాతం సంచిత వార్షిక వృద్ధి రేటుతో 28.8 బిలియన్ అమెరికన్ డాలర్లకు (రూ.2.50 లక్షల కోట్లు) చేరనుంది. ఏఐతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లోనూ ఉద్యోగావకాశాలు విస్తరిస్తుండగా, ప్రత్యేక నైపుణ్యాల కొరత తీవ్ర సమస్యగా మారుతోంది. ముఖ్యంగా జెనరేటివ్ ఏఐ రంగంలో ప్రతి 10 ఉద్యోగ ఖాళీలకు ఒక అర్హత కలిగిన నిపుణుడు మాత్రమే అందుబాటులో ఉండటం సవాలుగా మారింది.

ఏఐ రంగంలో ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఎల్‌ఎల్‌ఎమ్ సేఫ్టీ, ఏఐ ఆర్కెస్ట్రేషన్, ఏజెంట్ డిజైన్, కాంప్లియెన్స్ మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి నైపుణ్యాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నైపుణ్యాలు భవిష్యత్ ఉద్యోగ విపణిలో కీలక పాత్ర పోషించనున్నాయి. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (జీసీసీలు)లో జెనరేటివ్ ఏఐ ఇంజినీరింగ్, మెషీన్ లెర్నింగ్ ఆపరేషన్స్ విభాగాల్లో ఉద్యోగులు సంవత్సరానికి రూ.58-60 లక్షల వరకు వేతనం పొందుతున్నారు. డేటా ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో కూడా వేతనాలు భారీగా పెరుగుతున్నాయి.

జీసీసీలు కొత్త ఉద్యోగ సృష్టిలో ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. 2027 నాటికి భారత్‌లో జీసీసీల సంఖ్య 2,100కు చేరుతుందని, వీటిలో సుమారు 30 లక్షల మంది నిపుణులు పనిచేయనున్నారు. ఈ సెంటర్లు మెట్రో నగరాలతో పాటు రెండో, మూడో అంచె పట్టణాల్లోనూ ప్రతిభావంతుల నియామకానికి దోహదపడుతున్నాయి. మహిళా ప్రాతినిధ్యం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలతో భారత్‌ గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మరింత బలపడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Recent Posts

Kaleshwaram Project : కేసీఆర్ కు భారీ ఊరట..సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేక్

Huge Relief for KCR : తెలంగాణ హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పీసీ…

11 hours ago

BSNL | బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి భారీ డేటా ఆఫర్లు .. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ!

BSNL | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) మరోసారి ఆకర్షణీయమైన డేటా ప్లాన్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రైవేట్…

12 hours ago

Pawan- Bunny | పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్‌కు బ్రేక్ పడే సమయం వచ్చిందా?

Pawan- Bunny |  ఇండియన్ సినిమా అభిమానుల మధ్య హీరోల గురించి వాదనలు, గొడవలు, ట్రోలింగ్‌లు కొత్త విషయం కాదు.…

13 hours ago

KCR Suspends Kavitha from BRS : బిఆర్ఎస్ నుండి కవిత అవుట్..కేసీఆర్ కీలక నిర్ణయం

KCR suspends daughter K Kavitha from BRS : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ బీఆర్ఎస్ పార్టీ కీలక…

13 hours ago

KCR | కాళేశ్వరం కేసులో కేసీఆర్‌, హరీష్ రావుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట

KCR | తెలంగాణ హైకోర్టు కీలక తీర్పుతో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేత హరీష్ రావులకు తాత్కాలిక ఊరట…

14 hours ago

OG | ఓజీ ఒక్క టిక్కెట్ ధ‌ర రూ.5ల‌క్ష‌లా.. ప‌వ‌న్ క్రేజ్ ఇలా ఉంట‌ది మ‌రి..!

OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా…

15 hours ago

Pawan Kalyan | ప‌వన్ క‌ళ్యాణ్‌కి శుభాకాంక్ష‌ల వెల్లువ‌.. చిరు, మోదీ, బ‌న్నీ స్పెష‌ల్ విషెస్

Pawan Kalyan | నేడు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావ‌డంతో సినీ, రాజ‌కీయ,…

16 hours ago

Turmeric | పసుపు నీటిలో ఆరోగ్య రహస్యాలు .. ప్రతిరోజూ పరగడుపున‌ తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు!

Turmeric | మన వంటింట్లో నిత్యం కనిపించే పసుపు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధగుణాలతో నిండి ఉంటుంది. పసుపులో ఉండే…

17 hours ago