AP Govt Jobs : ఏపీలో 175 ఉద్యోగాలకి నోటిఫికేషన్ .. నెలకి రూ.60 వేల జీతం..!
AP Govt Jobs : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రణాళికా శాఖలో ఖాళీగా ఉన్న 175 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో 175 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్, అలాగే ప్రభుత్వ P4 కార్యక్రమ సమన్వయానికి.. కాంట్రాక్ట్ పద్ధతిలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
AP Govt Jobs : ఏపీలో 175 ఉద్యోగాలకి నోటిఫికేషన్ .. నెలకి రూ.60 వేల జీతం..!
అభ్యర్థుల పనితీరు, అవసరాల ఆధారంగా ఈ కాంట్రాక్టు కాలాన్ని భవిష్యత్తులో పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఈ యంగ్ ప్రొఫెషనల్స్ పనిచేయాల్సి ఉంటుంది.ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీఏ లేదా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) డిగ్రీని కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60,000 చొప్పున వేతనం చెల్లించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. వయోపరిమితి విషయానికొస్తే, 2025 మే 1వ తేదీ నాటికి అభ్యర్థి వయసు 40 ఏళ్లు మించకూడదని పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ విధానంలో మే 13వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూలను ప్రామాణికంగా తీసుకుంటారని ప్రభుత్వం తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, ఎంపిక విధానం, వేతనం తదితర పూర్తి వివరాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన https://apsdpscareers.com/YP.aspx వెబ్ పోర్టల్‌ను సంప్రదించాలి.
Oriental Jobs : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…
Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
This website uses cookies.