Home » Jobs Education » Iict Hyderabad Jobs Notification Release
Jobs Education

IICT Jobs : IICT హైదరాబా లో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ రిలీజ్.. ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: November 16, 2024 11:16 pm
Advertisement

హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT ) లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు 31 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. దాదాపు నెలకు 1.34 లక్షల జీతంతో ఈ జాబ్ ఉంటుంది. సర్చింగ్ అండ్ డెవలప్మెంట్ వృత్తిని కోరుకునే వ్యక్తులకు ఇది ఒక మంచి అవకాశం. ఐతే దీనికి అర్హతగా సంబంధిత రంగాలలో ఎం.ఈ, ఎం టెక్ లేదా పి.హెచ్.డి అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్దులు డిసెంబర్ 9, 2024 న లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు.

Advertisement

IICT హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2024 :

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT), హైదరాబాద్ లో మొత్తం ఖాళీలు : 31
పోస్ట్ పేరు : సైంటిస్ట్

Advertisement

అప్లికేషన్ మోడ్ : ఆన్‌లైన్

దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ : 9 డిసెంబర్ 2024

Advertisement

జీతం నెలకు : 1,34,907 రూపాయలు

దరఖాస్తు రుసుము : 500 రూ.లు

అధికారిక వెబ్‌సైట్ IICT రిక్రూట్‌మెంట్ పోర్టల్

అర్హత ప్రమాణాలు

Advertisement

విద్యా అర్హతలు

అభ్యర్థులు తప్పనిసరిగా ME, MTech లేదా పి.హెచ్.డి కలిగి ఉండాలి :

ఆర్గానిక్ కెమిస్ట్రీ

ఆగ్రో కెమిస్ట్రీ

Advertisement

అకర్బన రసాయన శాస్త్రం

సైన్స్ అండ్ టెక్నాలజీ

సేంద్రీయ పూత

పాలిమర్లు

రసాయన జీవశాస్త్రం

డిజైన్ ఇంజనీరింగ్ వంటి రంగాల్లో పి.హెచ్.డి కలిగి ఉండాలి.

నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అనుభవం కూడా ఉండాలి.

వయస్సు : గడువు తేదీ నాటికి అభ్యర్థులు 32 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ

అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: IICT రిక్రూట్‌మెంట్ పోర్టల్‌కి వెళ్లాలి : IICT రిక్రూట్‌మెంట్ పోర్టల్.

నమోదు ఇంకా లాగిన్ : మీ ఇమెయిల్ ఈడ్, ఫోన్ నంబర్‌ని వాడుకుని ఎకౌంట్ సృష్టించాలి.

దరఖాస్తు ఫామ్‌ నింపాలి : వ్యక్తిగత ఇంకా విద్యా అర్హత మరియు వృత్తిపరమైన వివరాలను నమోదు చేత్యాలి.

అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

IICT Jobs : IICT హైదరాబా లో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ రిలీజ్.. ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి..!

విద్యా ధృవపత్రాలు అనుభవం సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో స్కాన్ చేసిన సంతకం తో ఉంచాలి.

దరఖాస్తు రుసుము : ఎస్.బి.ఐ చెల్లింపు లింక్ ద్వారా 500 రూ.లు రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించాలి. IICT, Hyderabad, Jobs, Notification, IICT Jobs

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి