Post Office Jobs : 10వ తరగతి అర్హతతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు… ఎలా అప్లై చేయాలంటే…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 25 April 2024, 8:00 am
  •  Post Office Jobs : 10వ తరగతి అర్హతతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు... ఎలా అప్లై చేయాలంటే...!

Post Office Jobs  : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకిి ఇండియన్ పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించారు. దీంతో ప్రస్తుతం ఆఫ్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఇక ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ ఖాళీలన్నీ కూడా కర్ణాటక ప్రాంతానికి చెందినవి . మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Post Office Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి ఇండియన్ పోస్ట్ రిక్రూట్మెంట్ డ్రైవర్ 2024 నుండి విడుదల కావడం జరిగింది.

Post Office Jobs  ఖాళీలు…

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 స్టాఫ్ కార్ డ్రైవర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

చిక్కోడి – 1

కలబురగి – 1

హవేరి – 1

కార్వార్ – 1

బెంగళూరు – 15

మాండ్య – 1

మైసూర్ – 3

పుత్తూరు – 1

శివమొగ్గ – 1

ఉడిపి – 1

కోలార్ – 1

Post Office Jobs  విద్యార్హత…

ఈ ప్రభుత్వ ఉద్యోగులకు అప్లై చేయాలి అనుకున్నవారు కచ్చితంగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Post Office Jobs  వయస్సు…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారి వయసు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ,STలకు ఐదు సంవత్సరాలు OBCలకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

Post Office Jobs : 10వ తరగతి అర్హతతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు... ఎలా అప్లై చేయాలంటే...!

Post Office Jobs : 10వ తరగతి అర్హతతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు… ఎలా అప్లై చేయాలంటే…!

జీతం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతినెల రూ.19,900 నుండి రూ.63,200 వరకు జీతం గా ఇస్తారు. అదేవిధంగా ప్రభుత్వం అందించే ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయి.

ఎంపిక విధానం…

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారు థియరీ టెస్ట్ , డ్రైవింగ్ టెస్ట్, మోటర్ మెకానిజం టెస్టులకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనిలో డ్రైవింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారు. ఇక దీనిలో ఎంపికైన వారికి రెండు సంవత్సరాల వరకు ప్రొబెషన్ పీరియడ్ నిర్ణయించబడింది.

అప్లై చేయు విధానం…

ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని పత్రాలతో పాటు దరఖాస్తు ఫారం ను నింపి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటిఫికేషన్ లో ఇచ్చిన చిరునామాకు డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటుంది.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి