APPSC Jobs : ఏపీలో పెద్ద ఎత్తున అటవీ శాఖలో ఉద్యోగ అవకాశాలు
APPSC Jobs : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh అటవీ శాఖలో ఉద్యోగ అవకాశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ (APPSC), తాజాగా మరో 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూలై 28 నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 17, 2025 వరకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రాథమిక పరీక్షను సెప్టెంబరు 7న ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హులవుతారు. మెయిన్స్ తేదీలు త్వరలో ప్రకటించనున్నారు.
APPSC Jobs : ఏపీలో పెద్ద ఎత్తున అటవీ శాఖలో ఉద్యోగ అవకాశాలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బోటనీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియోలజీ, అగ్రికల్చర్ వంటి సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. లేదా కెమికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసినవారూ అర్హులు. శారీరక కొలతలు నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి అదనంగా మార్కులు లభిస్తాయి. వయోపరిమితి 18–30 ఏళ్ల మధ్యగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ వంటి రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ప్రక్రియలో భాగంగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.330 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. రిజర్వేషన్ కేటగిరీకి చెందినవారికి ఫీజు మినహాయింపు కలదు. అభ్యర్థుల ఎంపిక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రాత పరీక్షల ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.32,670 నుంచి రూ.1,01,970 వరకు జీతం లభిస్తుంది. అర్హతలు, సిలబస్, శారీరక ప్రమాణాలు, దరఖాస్తు విధానం మొదలైన వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో https://psc.ap.gov.in పరిశీలించవచ్చు. అటవీ శాఖలో ఉద్యోగం కలలుగన్న వారికి ఇది ఓ చక్కటి అవకాశంగా నిలిచే అవకాశముంది.
Ridge Gourd : అదేంటి బీరకాయ తింటే కూడా అనారోగ్యమా. బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా అని…
Peacock Vastu Tips : వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఇంట్లో వాస్తు మూలాలు , వాటి దిశలనుబట్టి…
Kidneys Health : ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు కూడా ఒకటి. పనితీరు సక్రమంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. కంటే మనం…
Zodiac Signs : 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి, గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు, గ్రహాలకు రాకుమారుడైన…
Kethireddy : లిక్కర్ స్కామ్ పై టీడీపీ చేస్తున్న ఆరోపణలు అసత్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని వైఎస్సార్సీపీ మాజీ…
YS Sharmila : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో లిక్కర్ స్కాం పై Liquor scam సిట్ విచారణను ఎండగడుతూ…
Hari Hara Veera Mallu Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు…
Dancer Janu : తెలుగు టెలివిజన్‌లో సెన్సేషన్ అయిన ‘బిగ్ బాస్’ షో Big Boss Show Telugu తొమ్మిదో…
This website uses cookies.