RRC WR స్పోర్ట్స్ కోటాలో 64 పోస్టుల‌కు రిక్రూట్‌మెంట్.. చివ‌రి తేదీ సెప్టెంబర్ 14..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRC WR స్పోర్ట్స్ కోటాలో 64 పోస్టుల‌కు రిక్రూట్‌మెంట్.. చివ‌రి తేదీ సెప్టెంబర్ 14..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 August 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  RRC WR స్పోర్ట్స్ కోటాలో 64 పోస్టుల‌కు రిక్రూట్‌మెంట్ . చివ‌రి తేదీ సెప్టెంబర్ 14..!

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- వెస్ట్రన్ రైల్వే… 2024-25 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ ‘సి’/ గ్రూప్ ‘డి’ ఖాళీల భర్తీకి 64 పోస్టుల కోసం నోటిఫికేస‌న్‌ను వెలువ‌రించింది. అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా 16 ఆగస్టు నుండి 14 సెప్టెంబర్ 2024 వరకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వ్రాత‌, స‌ర్టిఫికెట్ల ధ్రువీక‌ర‌ణ ద్వారా ఎంపిక చేస్తారు. అధికారిక వెబ్‌సైట్ https://www.rrc-wr.com

RRC WR ఖాళీల వివరాలు

1. లెవెల్‌-4/5 : 5 పోస్టులు
2. లెవెల్‌-2/3 : 16 పోస్టులు
3. లెవెల్‌-1 : 43 పోస్టులు
మొత్తం ఖాళీలు : 64.
అర్హత : లెవెల్‌-4/5 పోస్టులకు ఏదైనా డిగ్రీ; లెవెల్‌-2/3 పోస్టులకు ఐటీఐ, పన్నెండో తరగతి; లెవెల్‌-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి.
జ‌న‌ర‌ల్, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులు రూ.250 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
క్రీడాంశాలు : బాస్కెట్‌బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.

ఎంపిక ప్రక్రియ:
1. శారీరక దృఢత్వ పరీక్ష
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్
3. వైద్య పరీక్ష

వయోపరిమితి : 01/01/2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

RRC WR స్పోర్ట్స్ కోటాలో 64 పోస్టుల‌కు రిక్రూట్‌మెంట్ చివ‌రి తేదీ సెప్టెంబర్ 14

RRC WR స్పోర్ట్స్ కోటాలో 64 పోస్టుల‌కు రిక్రూట్‌మెంట్.. చివ‌రి తేదీ సెప్టెంబర్ 14..!

ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 16-08-2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 14-09-2024.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది