Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త .. డీఎస్సీ నోటిఫికేషన్.. జాబ్ క్యాలెండర్ విడుద‌ల‌ ..!

 Authored By suma | The Telugu News | Updated on :19 February 2026,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త .. డీఎస్సీ నోటిఫికేషన్.. జాబ్ క్యాలెండర్ విడుద‌ల‌ ..!

Jobs : రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ జాబ్ క్యాలెండర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఉగాది పండుగను పురస్కరించుకుని భారీ స్థాయిలో ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఉగాది రోజున ప్రకటించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి…

Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త .. డీఎస్సీ నోటిఫికేషన్.. జాబ్ క్యాలెండర్ విడుద‌ల‌ ..!

Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త .. డీఎస్సీ నోటిఫికేషన్.. జాబ్ క్యాలెండర్ విడుద‌ల‌ ..!

Jobs : ఉగాదికి డీఎస్సీ నోటిఫికేషన్

మార్చి 19న తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ ఖాళీల వివరాలను సేకరించింది. మొత్తం దాదాపు 3,600 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఇందులో ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్థలు, సంక్షేమ శాఖ పాఠశాలల్లో సుమారు 1,200 పోస్టులు ఉన్నాయి. పంచాయతీరాజ్, మున్సిపల్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 1,700 ఖాళీలు ఉన్నాయి. అదనంగా ప్రత్యేక విద్యకు సంబంధించిన సుమారు 700 పోస్టులు భర్తీ చేయనున్నారు. గతంలో ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఈ ఏడాది కూడా ప్రకటన జారీ చేయడానికి సన్నాహాలు పూర్తి దశకు చేరుకున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా 15,941 పోస్టులు భర్తీ కాగా మొత్తం 16,347 పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టారు. కొంతమంది రిజర్వేషన్ అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని పోస్టులు ఖాళీగానే మిగిలిపోయాయి.

Jobs : కాంట్రాక్ట్ టీచర్లకు వెయిటేజీ

ప్రస్తుతం కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఈసారి డీఎస్సీలో ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పదేళ్ల సేవ పూర్తిచేసి టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి అదనపు మార్కులు కల్పించేందుకు యోచిస్తోంది. ప్రత్యేక అవసరాలు ఉన్న పాఠశాలల్లో దాదాపు 2,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పని చేస్తున్నారు. గత ఏడాది అమలు చేసిన సిలబస్‌నే ఈసారి కూడా కొనసాగించనున్నారు. పరీక్షా విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలుత కంప్యూటర్ నైపుణ్యం, ఇంగ్లీష్ ప్రావీణ్య పరీక్షలను నిర్వహించాలని భావించినప్పటికీ సమయంాభావం కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. సిలబస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

Jobs : జాబ్ క్యాలెండర్‌తో భారీ నియామకాలు

ఉపాధ్యాయ నియామకాలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శాఖల వారీగా ఖాళీల వివరాలను సేకరించి జాబ్ క్యాలెండర్ రూపకల్పన జరుగుతోంది. కాంట్రాక్టు ఉద్యోగుల లెక్కలు భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య వంటి వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా సుమారు 20 నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశముంది. ఇక దాదాపు 99 వేల ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉగాది సందర్భంగా విడుదలయ్యే జాబ్ క్యాలెండర్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిజమైన పండుగ కానుందని భావిస్తున్నారు.

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి