Telangana Govt : నిరుద్యోగులకు శుభవార్త.. గ్రామ పాలన అధికారి పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ పచ్చజెండా..!
ప్రధానాంశాలు:
Telangana Govt : నిరుద్యోగులకు శుభవార్త.. గ్రామ పాలన అధికారి పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ పచ్చజెండా..!
Telangana Govt : గ్రామ పాలన అధికారి (జీపీవో) పోస్టుల భర్తీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే మొత్తం 10,954 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపిన ప్రభుత్వం, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియామక ప్రక్రియను చేపట్టాలని భావిస్తోంది. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం అనుసరించిన విధానాన్ని ఇప్పుడు కూడా వర్తింపజేయాలని యోచనలో ఉంది. దీని ద్వారా గ్రామ స్థాయిలో పరిపాలన బలోపేతం అయ్యే అవకాశం ఉండగా, వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Telangana Govt : నిరుద్యోగులకు శుభవార్త.. గ్రామ పాలన అధికారి పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ పచ్చజెండా..!
Telangana Govt : 10,945 జీపీవో పోస్టులను భర్తీ చేయబోతున్న రేవంత్ సర్కార్
గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నూతనంగా జీపీవో పోస్టులను సృష్టించింది. మొదటగా వీటిని భర్తీ చేయడంలో వీఆర్‌ఏ, వీఆర్‌వోల మధ్య ఎంపిక ప్రక్రియ చేపట్టాలని భావించినా, పూర్తిస్థాయి అర్హతలు ఉన్నవారిని గుర్తించి, ప్రవేశ పరీక్షల ద్వారా నియమించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు సుమారు 7 వేల మందికి అర్హతలు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి కలెక్టర్ల ద్వారా ఆప్షన్లు తీసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
అయితే కొంతమంది అభ్యర్థులు తమకు ఉన్న పాత సేవలు పోతాయనే ఆందోళనతో కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌తో పాటు, వివిధ సర్దుబాట్లపై సమగ్రంగా ఆలోచన మొదలుపెట్టింది. ఈ నియామక ప్రక్రియపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే తుది నిర్ణయం వెల్లడించనున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే, ఈ కొత్త నియామకాలు గ్రామీణ పరిపాలనలో మార్పును తీసుకురావడంతో పాటు, యువతకు మంచి అవకాశాలుగా మారనున్నాయి.