TG MHSRB Lab : తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఫస్ట్‌ నోటిఫికేషన్ 1284 పోస్టులకు నోటిఫికేష‌న్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TG MHSRB Lab : తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఫస్ట్‌ నోటిఫికేషన్ 1284 పోస్టులకు నోటిఫికేష‌న్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :13 September 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  TG MHSRB Lab : తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఫస్ట్‌ నోటిఫికేషన్ 1284 పోస్టులకు నోటిఫికేష‌న్‌..!

TG MHSRB Lab : తెలంగాణ‌ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వివిధ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు 21 సెప్టెంబర్ 2024 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 1,284 ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

TG MHSRB Lab పోస్ట్ : ల్యాబ్ టెక్నీషియన్

ఖాళీల సంఖ్య – 1,284
ఆన్‌లైన్‌లో దరఖాస్తు 21 సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమవుతుంది
05 అక్టోబర్ 2024 దరఖాస్తుకు ఆఖ‌రు
దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే అక్టోబరు 5 నుంచి 7వ తేదీ మధ్య ఎడిట్‌ చేసుకోవచ్చు.
విద్యా అర్హత : డిప్లొమా/ PG/M.sc
వయో పరిమితి : 46 సంవత్సరాలు
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష
దరఖాస్తు రుసుము : రూ. 500
జీతం : రూ. 32,810- రూ. 96,890.

శాఖల వారీగా ఖాళీల సంఖ్య
పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ – 1,088
తెలంగాణ వైద్య విధాన పరిషత్ – 183
MNJ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ మరియు రీజినల్ క్యాన్సర్ సెంటర్ – 13
మొత్తం : 1,284

విద్యా అర్హత :
అభ్యర్థులు ఈ అర్హతలలో దేనినైనా కలిగి ఉండాలి

లేబొరేటరీ టెక్నీషియన్ కోర్సులో సర్టిఫికేట్
MLT VOC (ఇంటర్మీడియట్)
డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు.
B.sc (MLT) , Msc (MLT)
డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ (క్లినికల్ పాథాలజీ)
మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో బ్యాచిలర్ ‘
P.G డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ
P.G డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ
B.sc (మైక్రోబయాలజీ), M.sc (మైక్రోబయాలజీ)
మెడికల్ బయోకెమిస్ట్రీలో M.sc
క్లినికల్ మైక్రోబయాలజీలో M.sc
బయోకెమిస్ట్రీలో M.sc

TG MHSRB Lab తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఫస్ట్‌ నోటిఫికేషన్ 1284 పోస్టులకు నోటిఫికేష‌న్‌

TG MHSRB Lab : తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఫస్ట్‌ నోటిఫికేషన్ 1284 పోస్టులకు నోటిఫికేష‌న్‌..!

వయో పరిమితి :
TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ గ్రేడ్-II రిక్రూట్‌మెంట్‌లో ఈ పోస్ట్‌కు గరిష్ట వయస్సు 46 సంవత్సరాలు. 18- 46 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు అర్హులు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కల్పించారు. SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు అందించబడింది.

శాఖల వారీగా జీతం
పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ రూ. 32,810- రూ. 96, 890
తెలంగాణ వైద్య విధాన పరిషత్
MNJ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ మరియు రీజినల్ క్యాన్సర్ సెంటర్ రూ. 31,040- రూ. 92,050.

ఎంపిక ప్రక్రియ :
వ్రాత పరీక్ష నిర్వహించబడుతుంది. వ్రాత పరీక్షలో అభ్యర్థుల పనితీరుకు 80 80 పాయింట్ల మార్కులు ఇవ్వబడతాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఆసుపత్రులు/సంస్థలు/ కాంట్రాక్టుపై ప్రోగ్రామ్‌లలో అభ్యర్థి సేవకు 20 పాయింట్లు ఇవ్వబడతాయి.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది