TS SSC 10th Results 2025 : తెలంగాణ టెన్త్ ఫలితాలు వచ్చేసాయి.. జస్ట్ ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్స్ తెలుసుకోండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TS SSC 10th Results 2025 : తెలంగాణ టెన్త్ ఫలితాలు వచ్చేసాయి.. జస్ట్ ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్స్ తెలుసుకోండి

 Authored By ramu | The Telugu News | Updated on :30 April 2025,2:58 pm

ప్రధానాంశాలు:

  •  TS SSC 10th Results 2025 : తెలంగాణ టెన్త్ ఫలితాలు వచ్చేసాయి.. జస్ట్ ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్స్ తెలుసుకోండి

TS SSC 10th Results 2025 : తెలంగాణ పదోతరగతి  పరీక్షల 10th Results download ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని Hyderabad రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 92.78గా నమోదైంది. ఇది గతేడాది కంటే 1.47 శాతం అధికం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈసారి ఫలితాల్లో కొన్ని కీలక మార్పులు చేశారు. మార్కులతో పాటు గ్రేడ్లు, రాత పరీక్ష, ఇంటర్నల్ మార్కులు అన్నింటినీ ముద్రించిన మెమో రూపంలో విద్యార్థులకు అందించనున్నారు.

TS SSC 10th Results 2025 తెలంగాణ టెన్త్ ఫలితాలు వచ్చేసాయి జస్ట్ ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్స్ తెలుసుకోండి

TS SSC 10th Results 2025 : తెలంగాణ టెన్త్ ఫలితాలు వచ్చేసాయి.. జస్ట్ ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్స్ తెలుసుకోండి

TS SSC 10th Results 2025 : టెన్త్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలదే హావ.. ఉత్తీర్ణత ఎంత శాతం అంటే !!

జిల్లాల వారీగా చూస్తే మహబూబాబాద్ జిల్లా అత్యధికంగా 99.29 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా, వికారాబాద్ జిల్లా అత్యల్పంగా 73.97 శాతం మాత్రమే సాధించింది. గురుకుల పాఠశాలల్లో అత్యధికంగా 98 శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా, ప్రైవేట్ పాఠశాలలు 94.12 శాతం, ఆశ్రమ పాఠశాలలు 95 శాతం ఉత్తీర్ణత సాధించాయి. రాష్ట్రంలోని 4,629 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదు కావడం గర్వకారణం కాగా, రెండు ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయిన పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది.

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లు లేదా లింకుల ద్వారా చూడవచ్చు . ఫలితాల్లో మెమోలు త్వరలో స్కూళ్లకు పంపిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ కోర్సులను ఎంచుకోవచ్చు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని, పరీక్షా విధానంలో మరిన్ని పారదర్శకతను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి

https://results.bsetelangana.org
https://results.bse.telangana.gov.in
https://bse.telangana.gov.in

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది