Jobs : గుడ్‌న్యూస్‌.. పది పాసైతే ఉద్యోగ అవకాశం.. వేలలో జీతం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jobs : గుడ్‌న్యూస్‌.. పది పాసైతే ఉద్యోగ అవకాశం.. వేలలో జీతం

 Authored By ramu | The Telugu News | Updated on :9 August 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Jobs : గుడ్‌న్యూస్‌.. పది పాసైతే ఉద్యోగ అవకాశం.. వేలలో జీతం

Jobs : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో మరొక మెగా జాబ్ మేళా విజయనగరంలో నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 9 గంటలకు, విజయనగరం పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్ డిగ్రీ కాలేజీలో ఈ మేళా జరుగనుందని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎన్. గోవింద తెలిపారు.

Jobs గుడ్‌న్యూస్‌ పది పాసైతే ఉద్యోగ అవకాశం వేలలో జీతం

Jobs : గుడ్‌న్యూస్‌.. పది పాసైతే ఉద్యోగ అవకాశం.. వేలలో జీతం

Jobs : గొప్ప అవ‌కాశం

జాబ్ మేళా ఆగస్టు 12 న ఉదయం 9:00 గంటలకు, ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్ డిగ్రీ కాలేజీ, విజయనగరంలో జ‌ర‌గ‌నుంది. APSSDC (ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ) ఆధ్వ‌ర్యంలో 12 ప్రముఖ బహుళజాతి కంపెనీలు పాల్గొన‌నున్నాయి. అర్హతలు: పదవ తరగతి,ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ,పీజీ చదువుకున్న వారు

జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ https://naipunyam.ap.gov.in ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. నమోదు అయిన తర్వాత పొందే యూనిక్ నంబర్ ఇంటర్వ్యూకు తప్పనిసరిగా తీసుకురావాలి. ఇంటర్వ్యూకు తీసుకురావలసిన పత్రాలువిద్యార్హతల మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రొఫెషనల్ రెస్యూమ్, యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ . ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు ఇది ఓ విలువైన అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం యువత అభివృద్ధికి ఇచ్చే ప్రాధాన్యతలో భాగంగా, ఈ రకమైన జాబ్ మేళాలు నిరుద్యోగుల జీవితాల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది