Railway Job : ఎలాంటి పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగం.. అందుకు మీరు చేయవలసింది ఏంటంటే..!
Railway Job : రైల్వేలో ఎప్పటికప్పుడు కొత్త పోస్ట్‌లు పడుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే వెస్ట్ సెంట్రల్ రైల్వే (డబ్ల్యూసీఆర్) ప్రకటన విడుదల చేసింది. ఎంపికయ్యే వారికి దీని పరిధిలోని రైల్వే డివిజన్లు, యూనిట్లలో పోస్టింగ్‌లు కేటాయిస్తారు.ఏసీ మెకానిక్, బుక్ బైండర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, సర్వేయర్, వెల్డర్, వైర్‌మ్యాన్ తదితర విభాగాల్లో అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్ ఇవ్వనున్నారు. కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి, ఇంటర్ పాసైన వారు అప్లై చేయొచ్చు.
అప్రెంటిస్‌షిప్ కోసం ఎంపిక చేసుకునే ట్రేడ్‌లో అభ్యర్థులకు తప్పనిసరిగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. అభ్యర్థులు wcr.indianrailways.gov.in వెబ్‌సైట్ ద్వారా సెప్టెంబర్ 4వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆగస్టు 5 నాటికి 15 నుంచి 24 ఏళ్లలోపు వారు ఈ అప్రెంటిస్‌షిప్ కోసం అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయో పరిమితిలో మినహాయింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.141. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు రూ.41 ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3317 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Railway Job : ఎలాంటి పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగం.. అందుకు మీరు చేయవలసింది ఏంటంటే..!
ఈ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమైంది. సెప్టెంబర్ 4 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది. అలాగే.. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి వివరాలకు https://wcr.indianrailways.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు. ఆయా అప్రెంటిస్‌షిప్ విభాగాల కోసం వచ్చే దరఖాస్తులను అభ్యర్థుల పదోతరగతి, ఇంటర్, ఐఐటీ ట్రేడ్ సర్టిఫికెట్లలోని మార్కుల ప్రాతిపదికన వడపోస్తారు. చివరగా ఒక మెరిట్ లిస్టును రూపొందిస్తారు. మెరిట్ లిస్టులోని వారిని అందుబాటులో ఉన్న అప్రెంటిస్‌షిప్ ఖాళీల ఆధారంగా నిర్దిష్ట నిష్పత్తిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లోనూ అర్హత సాధించే వారికి చిట్టచివరగా మెడికల్ ఎగ్జామినేషన్ చేసి జాబ్‌లోకి తీసుకుంటారు.
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
This website uses cookies.