Railway Job : ఎలాంటి ప‌రీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగం.. అందుకు మీరు చేయ‌వ‌ల‌సింది ఏంటంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Railway Job : ఎలాంటి ప‌రీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగం.. అందుకు మీరు చేయ‌వ‌ల‌సింది ఏంటంటే..!

Railway Job : రైల్వేలో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పోస్ట్‌లు ప‌డుతూనే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (డబ్ల్యూసీఆర్‌) ప్రకటన విడుదల చేసింది. ఎంపికయ్యే వారికి దీని పరిధిలోని రైల్వే డివిజన్లు, యూనిట్లలో పోస్టింగ్‌లు కేటాయిస్తారు.ఏసీ మెకానిక్, బుక్ బైండర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, సర్వేయర్, వెల్డర్, వైర్‌మ్యాన్ తదితర విభాగాల్లో అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్ ఇవ్వనున్నారు. కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి, […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 August 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Railway Job : ఎలాంటి ప‌రీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగం.. అందుకు మీరు చేయ‌వ‌ల‌సింది ఏంటంటే..!

Railway Job : రైల్వేలో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పోస్ట్‌లు ప‌డుతూనే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (డబ్ల్యూసీఆర్‌) ప్రకటన విడుదల చేసింది. ఎంపికయ్యే వారికి దీని పరిధిలోని రైల్వే డివిజన్లు, యూనిట్లలో పోస్టింగ్‌లు కేటాయిస్తారు.ఏసీ మెకానిక్, బుక్ బైండర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, సర్వేయర్, వెల్డర్, వైర్‌మ్యాన్ తదితర విభాగాల్లో అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్ ఇవ్వనున్నారు. కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి, ఇంటర్ పాసైన వారు అప్లై చేయొచ్చు.

Railway Job ఇలా అప్లై చేయండి..

అప్రెంటిస్‌షిప్ కోసం ఎంపిక చేసుకునే ట్రేడ్‌లో అభ్యర్థులకు తప్పనిసరిగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్‌ ఉండాలి. అభ్యర్థులు wcr.indianrailways.gov.in వెబ్‌సైట్ ద్వారా సెప్టెంబర్‌ 4వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆగస్టు 5 నాటికి 15 నుంచి 24 ఏళ్లలోపు వారు ఈ అప్రెంటిస్‌షిప్ కోసం అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయో పరిమితిలో మినహాయింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.141. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు రూ.41 ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 3317 యాక్ట్‌ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Railway Job ఎలాంటి ప‌రీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగం అందుకు మీరు చేయ‌వ‌ల‌సింది ఏంటంటే

Railway Job : ఎలాంటి ప‌రీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగం.. అందుకు మీరు చేయ‌వ‌ల‌సింది ఏంటంటే..!

ఈ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 4 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది. అలాగే.. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి వివరాలకు https://wcr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు. ఆయా అప్రెంటిస్‌షిప్ విభాగాల కోసం వచ్చే దరఖాస్తులను అభ్యర్థుల పదోతరగతి, ఇంటర్, ఐఐటీ ట్రేడ్ సర్టిఫికెట్లలోని మార్కుల ప్రాతిపదికన వడపోస్తారు. చివరగా ఒక మెరిట్ లిస్టును రూపొందిస్తారు. మెరిట్ లిస్టులోని వారిని అందుబాటులో ఉన్న అప్రెంటిస్‌షిప్ ఖాళీల ఆధారంగా నిర్దిష్ట నిష్పత్తిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లోనూ అర్హత సాధించే వారికి చిట్టచివరగా మెడికల్ ఎగ్జామినేషన్‌ చేసి జాబ్‌లోకి తీసుకుంటారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది