Home » Karimnagar » Minister Gangula Says Telangana State Is No 1 In Country
karimnagar

Karimnagar..అభివృద్ధిలో నెంబన్ వన్ తెలంగాణ: మంత్రి గంగుల

Authored By
praveen T
The Telugu News | Updated on: September 10, 2021 9:45 pm
Advertisement

అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ తెలంగాణ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ పట్టణంలోని మూడో డివిజన్‌లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.12 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు మంత్రి కమలాకర్ భూమి పూజ చేశారు. కొబ్బరి కాయ కొట్టి, గడ్డపారతో భూమిని తవ్వి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ సర్కారు అహర్నిశలు పని చేస్తున్నదని మంత్రి గంగుల చెప్పారు.

Advertisement

సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పథంలో తెలంగాణ దూసుకుపోతున్నదని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కారు పాటు పడుతుందని తెలిపారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో కరీంనగర్ పట్టణ మేయర్ వై.సునీల్‌రావు, కమిషనర్ గరిమ అగర్వాల్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి