Home » Krishna » Pregnant Women Suicide
krishna

krishna : అన్నా చెల్లెలి గొడ‌వ… నిండు గ‌ర్భ‌ణి ఆత్మ‌హ‌త్య‌

Authored By
Tech Desk
The Telugu News | Updated on: August 3, 2021 12:06 pm
Advertisement

krishna : వ‌క్క‌ల గ‌డ్డ : అన్నా చెల్లెలి గొడ‌వ కార‌ణంగా గ‌ర్భిణి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న కృష్ణా జిల్లా వ‌క్క‌ల‌గ‌డ్డ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… పాండు రంగారావు కుమార్తె నాగ భార్గ‌వికి (20) సంవ‌త్స‌రం న‌ర క్రితం హైదరాబాద్‌కు చెందిన చార్డెడ్ అకౌంటెంట్‌గా ప‌ని చేస్తున్న సాయి శంక‌ర్‌తో వివాహ‌మైంది. భార్గ‌వి గ‌ర్భం దాల్చ‌డంతో పుట్టింటికి వ‌చ్చింది.

Advertisement

krishna

నాగ‌భార్గ‌వి అన్న నిఖిల్ త‌న చెల్లితో త‌ర‌చూ ఏదో ఒక విష‌యంలో గొడ‌వ ప‌డుతున్నారు. ఇదే క్ర‌మంలో ఆదివారం కూడా గొడ‌వ జ‌రిగింది. తీవ్ర మ‌న‌స్థాపం చెందిన నాగ‌భార్గ‌వి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. కొద్ది సేప‌టి త‌ర్వాత త‌ల్లి భార్గ‌వి గ‌దిలోకి వెళ్లి చేసే స‌రికి నాగ‌భార్గ‌వి ఉరికి వేలాడుతూ కనిపించింది.

Advertisement

గ‌ర్భిణి అయిన త‌న కూతురు ఉరికి వేలాడుతుండ‌టంతో హ‌తాశురాలైన త‌ల్లి ఇరుగుపొరుగు వారి స‌హాయంతో మ‌చిలీప‌ట్నం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు భార్గ‌విని పరీక్షించి మార్గం మ‌ధ్య‌లోనే మృతి చెందిన్లు నిర్థారించారు. మృతురాలి త‌ల్లినాగ‌ల‌క్ష్మి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.

Tech Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి