Home » Exclusive » Young Girl Facebook Post Viral In Assam
Exclusive

Viral Video : యువతిని అడ్రస్ అడుగుతూ అక్కడ నొక్కాడు.. ఆకతాయికి సరైన బుద్ధి చెప్పిన యువతి.. వీడియో

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: August 3, 2021 11:50 am
Advertisement

Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకటే చర్చ. ఒక యువతి.. ఒక ఆకతాయికి ఎలా బుద్ధి చెప్పింది అనే దానిపై విపరీతంగా చర్చ నడుస్తోంది. ఓ యువతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. స్కూటీ మీద వెళ్తున్న ఓ యువకుడు ఆ యువతిని ఆపి అడ్రస్ అడిగాడు. దీంతో తను అడ్రస్ చెబుతుండగానే.. ఆ యువతి చాతి మీద చేయి వేసి ఆ యువకుడు చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. చాతిని నొక్కాడు. దీంతో ఆగ్రహం చెందిన ఆ యువతి.. ఆ యువకుడిని స్కూటీ నుంచి కిందికి లాగి.. స్కూటీని పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేసి రెండు పీకింది.

Advertisement

young girl facebook post viral in assam

ఇంతలో అక్కడికి స్థానికులు వచ్చి అసలు విషయం తెలుసుకొని ఆ యవకుడిని చితకబాదారు. తర్వాత ఆ యువకుడిని తిడుతూ.. నడిరోడ్డు మీద ఆ యువతి.. ఆకతాయితో క్షమాపణలు చెప్పించి వీడియో తీసి ఆ వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేసింది.

Advertisement

young girl facebook post viral in assam

Viral Video :  ఆ యువతి ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్ట్ ఏంటంటే?

నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఓ యువకుడు వచ్చి అడ్రస్ అడిగి.. నా ప్రైవేట్ పార్ట్స్ ను ప్రెస్ చేశాడు. ఆ ఒక్క క్షణం నాకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. నా బ్రెస్ట్ ప్రెస్ చేసి పారిపోతున్న ఆ యువకుడిని అడ్డగించి పట్టుకొని.. కింద పడేశాను. స్కూటీని తీసుకెళ్లి డ్రెయిన్ లో పడేశా. ఒక్క క్షణం ఆలస్యమైనా ఆ వ్యక్తి పారిపోయి ఉండేవాడు. మరో అమ్మాయితో అలాగే చేసేవాడు. నేను కూడా ఆ క్షణం ఏం జరిగిందో తలుచుకుంటూ జీవితాంతం నరకం అనుభవించి ఉండేదాన్ని. కానీ.. నేను మాత్రం నా బలాన్ని మొత్తం ఉపయోగించి.. అతడిని పట్టుకొని నలుగురి ముందు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించాను. మహిళలు ధైర్యంగా లేకపోతే.. ఇంకా ఎన్నో నిర్భయ ఘటనలు చోటు చేసుకుంటాయి. అందుకే.. మహిళలు ఒంటరి కాదు.. వాళ్లకు ఉన్న ధైర్యమే వాళ్లకు బలం అని చాటి చెప్పడం కోసమే ఈ పోస్ట్ పెడుతున్నా.. అంటూ ఆ యువతి ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను షేర్ చేసింది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==>  దీప ఉందని తెలియక దీప కారునే లిఫ్ట్ అడిగి ఎక్కిన మోనిత.. ఇద్దరూ ఒకే కారులో సూర్యాపేటకు.. వాట్ ఏ ట్విస్ట్

ఇది కూడా చ‌ద‌వండి ==> బుల్లితెరకు పూర్తిగా గుడ్ డై.. యాంకర్ వర్షిణి పని ఖతం!!

ఇది కూడా చ‌ద‌వండి ==> హాకీ స్టిక్ కూడా కొనలేని స్థితి నుంచి.. టీమిండియా కెప్టెన్ గా.. ‘రాణి’స్తున్న రాంపాల్ హార్ట్ టచింగ్ జర్నీ..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆ సీనియర్ నేతకు చంద్రబాబు భారీ షాక్? రాజకీయ మేధావినే పక్కకు తప్పిస్తున్న చంద్రబాబు?

Advertisement

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి