Ration Card : విడ్డూరం.. ఒక్క రేషన్ కార్డులో హిందూ ముస్లీంలు కలిసి 68 మంది…!
Ration Card : దేశ వ్యాప్తంగా రేషన్ కార్డుల విషయంలో అవినీతి జరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో రేషన్ విధానం ఆన్ లైన్ కావడం వల్ల పలు అక్రమాలు బయటకు వస్తున్నాయి. రేషన్ కార్డులో ఇష్టానుసారంగా పేర్లను చేర్చి రేషన్ తీసుకుంటున్న వారు బయట పడుతున్నారు. కాని ఇప్పటి వరకు చిన్న చేపలు పట్టుబడ్డాయి కాని మొదటి సారి తిమింగలం ను అధికారులు గుర్తించారు. ఒక్క రేషన్ కార్డు మీద ఏకంగా 68 మందికి రేషన్ అందుతోంది. ఈ విషయం అధికారులు చూసి అవాక్కయ్యారు. అసలు ఇదేలా సాధ్యం అంటూ కాస్త లోతుగా ఎంక్వౌరీ చేయగా ఆ 68 మందిలో కొందరు హిందువులు మరికొందరు ముస్లీంలు ఉండటం కూడా మరింత ఆశ్చర్యంను అనుమానంను కలిగించింది.
Ration Card : ఒక్క రేషన్ కార్డుకు నెలకు 38 క్వింటాళ్ల దాన్యం…
బీహార్ రాష్ట్రం మహువా ఎస్టీఓ సందీప్ కుమార్ జనరల్ చెకప్ లో భాగంగా రేషన్ పంపిణీకి సంబంధించిన విషయాలు పరిశీలిస్తూ ఉండగా ఒకే కుటుంబం ప్రతి నెల 38 క్వింటాళ్ల దాన్యంను తీసుకుంటున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. దాంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు రేషన్ డీలర్ పై కేసు నమోదు చేశాడు. అలాగే రేషన్ ను తీసుకుంటున్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో గత కొంత కాలంగా తీసుకుంటున్న దాన్యంను రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అధికారులు చెప్పుకొచ్చారు.
Ration Card : అవినీతికి పరాకాష్ట..
ఈ మొత్తం వ్యవహారంలో రేషన్ డీలర్ సంజయ్ కుమార్ అవినీతి తేటతెల్లం అవుతుంది. డబ్బుకు ఆశ పడి ఏకంగా 68 మందితో కూడిన రేషన్ కార్డుకు ఆమోదం తెలపడం తో పాటు గత కొన్ని నెలలుగా రేషన్ ఇస్తున్నాడు. దాంతో అతడిపై కఠిన చట్టాలతో కేసు నమోదు చేయడంతో పాటు అతడి డీలర్ షిప్ లైసెన్స్ ను కూడా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇలాంటి రేషన్ అక్రమాలు మరెన్ని జరుగుతున్నాయో కదా అంటూ సామాన్య జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.