
27 July 2022 Today Gold Rates In Telugu
Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినట్టుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా కూడా ఏదో తక్కువగా తగ్గి ఎక్కువగా ధరలు పెరుగుతున్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. మళ్లీ నిన్న కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇవాళ మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు పెరిగాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4675 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 కాగా నిన్నటి ధరలతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5100 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,150 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి రూ.60.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.5.40 పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.604 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.54 పెరిగింది. కిలో వెండి ధర రూ.60,400 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.5400 పెరిగింది.
చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.604 కాగా, కిలో వెండి ధర రూ.60400 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతాలో మాత్రం 10 గ్రాముల వెండి ధర రూ.550 కాగా, కిలో వెండి ధర రూ.55000 గా ఉంది.
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
This website uses cookies.