Raghav Chadha : నా నోరు నొక్కితే గెలిచినట్లు కాదు.. సొంత పార్టీపై రాఘవ్‌ చడ్డా సంచలన వ్యాఖ్యలు.. BJP లోకి ఎంట్రీ కన్ఫర్మ్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :3 April 2026,4:00 pm

Raghav Chadha : జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీలో Aam Aadmi Party ఇప్పుడు సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఆ పార్టీకి కీలక నేతగా, ట్రబుల్ షూటర్‌గా, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు Arvind Kejriwal అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న యువ ఎంపీ రాఘవ్ చడ్డా Raghav Chadha.. ఇప్పుడు తన సొంత పార్టీపైనే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభలో ఆప్ ఉపనేత Deputy Leader పదవి నుంచి ఆయనను అకస్మాత్తుగా తప్పించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పరిణామంపై ఎంపీ రాఘవ్ చడ్డా గురువారం ఒక వీడియో సందేశం ద్వారా తీవ్రస్థాయిలో స్పందించారు. పార్టీ అధిష్టానాన్ని బహిరంగంగానే ప్రశ్నించారు.

Raghav Chadha Fire on AAP: నా నోరు నొక్కితే గెలిచినట్లు కాదు.. సొంత పార్టీపై రాఘవ్‌ చడ్డా సంచలన వ్యాఖ్యలు.. BJP లోకి ఎంట్రీ కన్ఫర్మ్?

Raghav Chadha Fire on AAP: నా నోరు నొక్కితే గెలిచినట్లు కాదు.. సొంత పార్టీపై రాఘవ్‌ చడ్డా సంచలన వ్యాఖ్యలు.. BJP లోకి ఎంట్రీ కన్ఫర్మ్?

Raghav Chadha  నా గళాన్ని అణచివేయలేరు.. నదిలా విరుచుకుపడతా

“నా నోరు నొక్కితే మీరు గెలిచినట్లు కాదు” అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రాఘవ్ చడ్డా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి కుట్రపూరిత ప్రయత్నాలతో తన గళాన్ని అణచివేయాలని చూస్తున్నారని, కానీ తనను ఎవరూ ఓడించలేరని ఆయన స్పష్టం చేశారు. ఆ వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ.. “నేను పార్లమెంట్‌లో ఎప్పుడు మాట్లాడే అవకాశం వచ్చినా.. కేవలం ప్రజా సమస్యలనే ప్రస్తావించాను. బహుశా నేను లేవనెత్తే అంశాలు సభలో సాధారణంగా చర్చించేవి కాకపోవచ్చేమో. కానీ, ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను ఎత్తిచూపడం ఏమైనా నేరమా? నేను చేసిన తప్పు ఏంటి?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

Raghav Chadha Fire on AAP నేను లేవనెత్తిన సమస్యలు ఇవే

పార్లమెంట్‌లో తాను మాట్లాడిన అంశాలను చడ్డా ఈ సందర్భంగా గుర్తుచేశారు. “ఎయిర్‌పోర్టుల్లో విపరీతంగా ఉంటున్న ఆహార పదార్థాల ధరలు, గిగ్‌ వర్కర్ల (డెలివరీ బాయ్స్ తదితరులు) కష్టాలు, టోల్‌ ప్లాజాల్లో జరుగుతున్న పగటి దోపిడీ, టెలికాం కంపెనీల ఇష్టారాజ్యంగా పెంచుతున్న రీఛార్జ్‌ విధానాలు.. ఇలా సామాన్యుడికి సంబంధించిన సమస్యలను నేను పార్లమెంట్‌లో గళమెత్తి అడిగాను. ఇవి అడిగితే ఆమ్ ఆద్మీ పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. దీనివల్ల పార్టీకి జరుగుతున్న నష్టం ఏంటి? ఎందుకు నన్ను పార్లమెంట్‌లో మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు?” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

స్వయంగా పార్టీ నేతలే కుట్ర చేశారు

తనను సభలో మాట్లాడకుండా చేయాలని సాక్షాత్తూ తన పార్టీ నేతలే రాజ్యసభ సెక్రటరీకి చెప్పడం తనను తీవ్రంగా కలచివేసిందని చడ్డా తెలిపారు. “ఇలాంటి చర్యలతో నా గళాన్ని మీరు తాత్కాలికంగా అణచివేయగలరు. కానీ, ఇది నా ఓటమి ఏమాత్రం కాదు. ప్రజల ఆశీస్సులు, మద్దతు నా పక్షాన ఉన్నాయి. వారి హక్కుల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. నన్ను నేను ఒక నదితో పోల్చుకుంటాను. నది ప్రశాంతంగా ఉన్నంత వరకే.. సమయం వచ్చినప్పుడు మాత్రం వరదలా విరుచుకుపడతాను” అని చడ్డా హెచ్చరించారు.

ఆప్ ఎందుకు వేటు వేసింది? అశోక్ మిత్తల్ కు బాధ్యతలు

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్‌ చడ్డాను ఆ బాధ్యతల నుంచి ఆకస్మాత్తుగా తొలగించిన ఆప్ అధిష్టానం.. ఆ స్థానంలో మరో ఎంపీ అశోక్‌ మిత్తల్‌ను Ashok Mittal నియమించింది. గత కొంతకాలంగా రాఘవ్ చడ్డా పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు దూరంగా ఉంటున్నారని, పార్టీకి సంబంధించిన కీలక వ్యవహారాలపై ఆయన స్పందించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆప్ వర్గాలు చెబుతున్నాయి.

భాజపా BJP లోకి రాఘవ్ చడ్డా?

ఈ మొత్తం ఎపిసోడ్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం రాఘవ్ చడ్డా భవిష్యత్ కార్యాచరణ. గత కొద్ది రోజులుగా ఆయన భారతీయ జనతా పార్టీ BJP లో చేరనున్నట్లు జాతీయ మీడియాలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ వస్తున్న సమయంలోనే ఆప్ ఆయనను పదవి నుంచి తప్పించడం, దానికి ప్రతిగా చడ్డా ఏకంగా వీడియో రిలీజ్ చేసి పార్టీని టార్గెట్ చేయడం చూస్తుంటే.. త్వరలోనే ఆయన కమలం గూటికి చేరడం ఖాయమనే వాదనలకు బలం చేకూరుతోంది.

ఢిల్లీ మద్యం కుంభకోణం, ఇతర కేసులతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి.. చడ్డా లాంటి యువ, ఫైర్ బ్రాండ్ నేత, అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు దూరం కావడం కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చడ్డా తదుపరి అడుగు ఏంటి? ఆయన నిజంగానే ఆప్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతారా? అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. జాతీయ రాజకీయాల్లో ఈ పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి