Home » Exclusive » Brs Wins In Nine Gram Panchayats In Maharashtra
Exclusive

BRS : మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్.. వేరే రాష్ట్రంలో సత్తా చాటిన పార్టీ.. ఇదీ కేసీఆర్ సత్తా అంటే

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: November 6, 2023, 7:45 pm
Advertisement

BRS : బీఆర్ఎస్ పార్టీ ఏమో అనుకున్నారు అందరూ. ఈసారి తెలంగాణ ఎన్నికల్లోనే గెలిచే సత్తా లేదు అని అంతా అనుకుంటున్నారు కానీ.. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కాదు.. అక్కడ కాదు ఏకంగా మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచింది. తన సత్తా చాటింది. అసలు వేరే రాష్ట్రాల్లో ఈ పార్టీని ఎవరు పట్టించుకుంటారు అని అన్న వాళ్లందరి నోళ్లు మూయించింది బీఆర్ఎస్ పార్టీ. అవును.. మహారాష్ట్రలో బోణీ కొట్టేసింది. భండారా జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పలు స్థానాలను గెలుచుకుంది. భండారా జిల్లాలోని 66 గ్రామ పంచాయతీలకు గాను 20 గ్రామ పంచాయతీల్లో ఫలితాలు రాగా… అందులో తొమ్మిది గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకుంది.

Advertisement

భండారాలో బీజేపీకి మద్దతు ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలకు ఉంటుంది. కానీ.. వాటిని దాటుకొని బీఆర్ఎస్ పార్టీ 9 గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. బీజేపీ, కాంగ్రెస్ రెండు గ్రామ పంచాయతీలను గెలుచుకోగా, ఎన్సీపీ ఒక్క  గ్రామ పంచాయతీని సాధించింది. ఇక.. విదర్భ, సోలాపూర్ ప్రాంతాల్లో కూడా ఫలితాలు ప్రకటించగా.. అక్కడ బీఆర్ఎస్ పార్టీ 15 స్థానాలను గెలుచుకున్నది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి