7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్. త్వరలోనే వాళ్లకు మళ్లీ జీతం పెరగనుంది. అంటే మళ్లీ డీఏ పెరగనుందన్నమాట. అవును.. గత మార్చిలోనే వాళ్లకు డీఏ పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ డీఏను పెంచబోతున్నారట. డీఏ పెంపు విషయంపై త్వరలోనే అప్ డేట్ రానుంది. వచ్చే నెల జులైలోనే వాళ్లకు డీఏ పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి సంవత్సరానికి రెండు సార్లు డీఏను పెంచాలి. ఇప్పటికే గత మార్చిలో పెరిగింది. ఇప్పుడు జులైలో పెంచబోతున్నారు. 3 నుంచి 4 శాతం వరకు డీఏ పెరిగే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. 3 నుంచి 4 శాతం డీఏ పెరిగితే ఖచ్చితంగా జీతాలు భారీగా పెరగనున్నాయి.
గత మార్చిలో పెరిగిన డీఏ ప్రకారం చూసుకుంటే జనవరి 1, 2023 నుంచి పెరిగిన జీతాలు అమలులోకి వచ్చాయి. మార్చి 2023 లో డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. అంటే 4 శాతం డీఏ పెరిగింది. మరో 4 శాతం పెరిగితే.. డీఏ 46 శాతం కానుంది. 46 శాతం డీఏ పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒక్కసారిగా పెరగనున్నాయి.డీఏ, డీఆర్ రెండు పెరిగితే.. 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పే ఆధారంగా డీఏ పెరుగుతుంది.
బేసిక్ పెన్షన్ ఆధారంగా డీఆర్ ను అందిస్తారు. ఇక.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా రాష్ట్రాల నిబంధనల ప్రకారం డీఏను పెంచుతారు. ఇటీవల జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తమ జీతాలను పెంచాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి నెట్ జీతం రూ.42 వేలు అయితే అందులో బేసిక్ పే రూ.25,500 ఉంటుంది. అందులో రూ.9690 డీఏ వస్తుంది. మరో 4 శాతం డీఏ పెరిగితే.. డీఏ పెంపు తర్వాత డీఏ రూ.10,710 గా ఉంటుంది. అంటే నెలకు రూ.1020 జీతం పెరుగుతుంది అన్నమాట.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.