Home » Exclusive » Husband Attacked 4 Months Old Pregnant Wife In Tamilnadu
Exclusive

Crime News : భార్యపై  అనుమానంతో గర్భిణీ అని కూడా చూడకుండా భర్త ఏం చేశాడో తెలిస్తే అతడిని చంపేస్తారు

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 31, 2022, 8:30 am
Advertisement

Crime News : ఈరోజుల్లో బంధాలకు విలువ లేదు. కోళ్లను, మేకలను చంపినట్టుగా అంత ఈజీగా మనుషులను కూడా చంపేస్తున్నారు. అందుకే ఈరోజుల్లో బంధాలకు, మనుషులకు కూడా విలువ లేకుండా పోయింది. సొంతవాళ్లు ఎవరో కూడా తెలుసుకోలేని పరిస్థితి నేడు నెలకొన్నది. మానవత్వం కరువైపోయింది నేటి సమాజంలో. నేటి ఈ ఘటన తమిళనాడు విలుప్పురం జిల్లా వీరంగిపురం అనే గ్రామంలో చోటు చేసుకుంది. భారతి అనే మహిళ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది.

Advertisement

husband attacked 4 months old pregnant wife in tamilnadu

నిజానికి.. భారతికి ముందే పెళ్లి అయింది ఈశ్వరన్ తో. కొన్నేళ్ల పాటు వీళ్లు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత భారతి.. గుణవన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్నేళ్ల పాటు ఇద్దరూ మంచిగా సఖ్యతతోనే ఉన్నారు. కానీ. ఇంతలో గుణవన్.. భారతిని అనుమానించడం మొదలు పెట్టాడు. వేరే వాళ్లతో అక్రమ సంబంధాలను అంటగడ్డేవాడు. కొన్ని నెలల కింద తను గర్భం దాల్చడంతో గుణవన్ కు ఆ అనుమానం మరింత ఎక్కువైంది.

Advertisement

Crime News : గర్భిణీ అని కూడా చూడకుండా భారతిపై  దాడి చేసిన గుణవన్

అయితే.. భారతి ప్రస్తుతం 4 నెలల గర్భంతో ఉంది. దీంతో తను గర్భిణీ అని కూడా చూడకుండా.. తనపై ఇష్టమొచ్చిన రీతిలో దాడి చేశాడు తన భర్త గుణవన్. ఇద్దరి మధ్య ఒకరోజు మాటా మాటా పెరగడంతో ఆవేశంలో తట్టుకోలేక గుణవన్ చేసిన పని అది. తనపై దాడి చేయడంతో తనకు తీవ్ర రక్త స్రావం అయింది. చివరకు భారతి రక్తపు మడుగులో పడిపోయింది. తనను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినా కూడా తను చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఇక.. తమ కూతురు చనిపోయిందని తెలుసుకున్న భారతి పేరెంట్స్ కూడా కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం లేపింది. ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంత విచక్షణారహితంగా భార్యపై దాడి చేసి గర్భిణీ అని కూడా చూడకుండా చంపేశాడు అంటూ భారతి కుటుంబ సభ్యులు, స్థానికులు మండిపడుతున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి