
guppedantha manasu 31 december 2022 full episode
Guppedantha Manasu 31 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 డిసెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 648 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగతి ఎంత చెప్పినా వినడు చక్రపాణి. నీ పాదాలకు నమస్కారం అయినా పెడతా కానీ.. నన్ను, నా కుటుంబాన్ని, నా కూతురును వదిలిపెట్టమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు చక్రపాణి. నాన్న ఏంటి అని వసుధార అన్నా కూడా వినడు చక్రపాణి. నీ పెళ్లి నీ ఇష్టమా. సరే చేస్తా ఉండు అని చెప్పి వసుధారను గదిలో పెట్టి బంధిస్తాడు చక్రపాణి. డోర్ తీయి అన్నా కూడా తీయకుండా తనను రూమ్ లో బంధించి బయటికి వస్తాడు. వసుధార ఫోన్ ను కూడా బయటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత నీళ్లలో విషం కలిపి సుమిత్ర, వసుధారను బెదిరిస్తాడు. నువ్వు తలుపు తీశావనుకో ఇది తాగి చస్తాను అంటాడు చక్రపాణి.
guppedantha manasu 31 december 2022 full episode
ఊరికే బెదిరించను. నీకు నేను కావాలో.. అది బయట ఉండాలో ఆలోచించుకో. ఆ తలుపు తీయొద్దు. ఈ ఫోన్ ఇవ్వొద్దు. ఒకవేళ అలా చేస్తే నా శవాన్ని చూస్తావు సుమిత్ర అని చెప్పి సుమిత్రను బెదిరించి వెళ్తాడు చక్రపాణి. దీంతో సుమిత్రకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు రాజీవ్ కు ఫోన్ చేస్తాడు చక్రపాణి. మీరేం కంగారు పడకండి మామయ్య గారు. పరువు మీది పోయినా, నాది పోయినా ఒకటే. పరువే ప్రాణంగా బతికే ఒక మామయ్య గారు నాకు ఉన్నారని గొప్పగా చెప్పుకున్నాను అంటాడు రాజీవ్. దీంతో నా పరువును మీరే కాపాడాలి అల్లుడు గారు. మనం వెంటనే కలవాలి అంటాడు చక్రపాణి. దీంతో మనం తప్పకుండా కలుద్దాం. ఉంటాను మామయ్య గారు అంటాడు రాజీవ్.
కట్ చేస్తే జగతి.. జరిగిన విషయం మొత్తం మహీంద్రాకు చెబుతుంది. నాకు భయంగా ఉంది. వసు వాళ్ల నాన్న గారు అలా మాట్లాడారంటే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అంటుంది జగతి. దీంతో ఈ విషయం రిషికి చెబుదామా అంటాడు మహీంద్రా. వద్దు రిషి టెన్షన్ పడతాడు అంటుంది జగతి.
మనం వెళ్దాం మహీంద్రా అంటుంది జగతి. అందరి కన్నా ముందు మనం వెళ్దాం.. అంటుంది జగతి. చెప్పకుండా ఎలా వెళ్తాం అంటే ఎలాగోలా వెళ్లాలి మహీంద్రా. మనం వెళ్తే ఏదో ఒకటి సర్దిచెప్పొచ్చు అంటుంది జగతి. ఇంట్లో నుంచి మనం ఏదో ఒకటి చెప్పి వెళ్దాం అంటుంది జగతి.
ఇది తప్ప మనకు వేరే దారి లేదు. అందరం కలిసి వెళ్తే అక్కడ ఉన్న పరిస్థితులను, వసు వాళ్ల నాన్న కోపాన్ని అక్కయ్య గారు తనకు అనుకూలంగా మార్చుకుంటారు. అందుకే వాళ్లను ఇక్కడే ఉండేలా చేయడం కూడా చాలా ముఖ్యం అని మహీంద్రాకు చెబుతుండగా దేవయాని అన్నీ వింటుంది.
వెంటనే రాజీవ్ కు ఫోన్ చేస్తుంది. రిషి కోసం మహీంద్రా, జగతి వస్తున్నారు. వసు వాళ్ల నాన్న ఈ పెళ్లి జరగనివ్వడని వాళ్లకు అర్థం అయినట్టుంది. రిషికి చెప్పకుండా వీళ్లు వస్తున్నారు అని చెబుతుంది. ఎలాగోలా ఈ సంబంధాన్ని కలపాలని ప్లాన్.. అంటుంది.
దీంతో రిషి సార్ ను డిస్టర్బ్ చేయడం చాలా ఈజీ అంటాడు రాజీవ్. దీంతో వెంటనే ఆ పనిలో ఉండు అంటుంది దేవయాని. మరోవైపు జగతి, మహీంద్రా ఇద్దరూ కలిసి వసు ఊరుకు బయలుదేరుతారు. వాళ్లను చూసి ఏంటి మహీంద్రా ఎక్కడికో బయలుదేరారు అని అడుగుతుంది.
దీంతో అలా బయటికి వెళ్లొద్దాం అని అంటాడు. వసు వాళ్ల ఇంటికి వెళ్లాలి కదా అంటే.. అదే వాళ్ల ఇంటికి వెళ్లడం కోసం చీరలు అవీ తీసుకురావాలి కదా. వాటి కోసం వెళ్తున్నాం అంటారు. దీంతో సరే వెళ్లిరండి అని చెబుతుంది. మరోవైపు అమ్మ తలుపు తీయ్ అమ్మ. కనీసం ఆ ఫోన్ అయినా ఇవ్వు అని అంటుంది వసు.
కానీ.. నేను ఇవ్వను.. నేను డోర్ తీయను అంటుంది సుమిత్ర. వసుధార ఎంత చెప్పినా వినదు. ఫోన్ అయినా ఇద్దాం అని అనుకునేలోపే.. చక్రపాణి సామాన్లు తీసుకొని ఇంటికి వస్తాడు. తలుపు తీశావా… అని అడుగుతాడు. దీంతో తీయలేదు అంటుంది. నేను తమాషాలు చేయడం లేదు. నిజంగానే చెబుతున్నాను అంటాడు.
ఇవన్నీ సామాన్లు ఏంటి అని అడుగుతుంది సుమిత్ర. దీంతో పెళ్లికి అంటాడు. పెళ్లి ఏంటి అంటే.. అల్లుడు రాజీవ్ తో చిన్నమ్మాయి వసుధార పెళ్లి అని చెప్పా కదా అంటాడు. దీంతో బావతో పెళ్లి ఏంటి.. నేను రిషి సార్ నే పెళ్లి చేసుకుంటాను అంటుంది వసుధార.
అయినా వినడు చక్రపాణి. రాజీవ్ తో నిశ్చితార్థం ఏర్పాటు చేస్తాడు చక్రపాణి. పెళ్లి జరగబోయే ఇల్లు ఇది. సుమిత్ర నువ్వు నాకు సాయం చేయొచ్చు కదా అంటాడు చక్రపాణి. దీంతో అది కాదండి.. అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయడం అవసరమా. మీకు దండం పెడతాను. ఇంకోసారి ఆలోచించండి అంటుంది సుమిత్ర.
దీంతో చంపేస్తాను.. తల్లికూతుళ్లు చెప్పినట్టు వినండి. ఈ చక్రపాణి పరువు ప్రతిష్టలు లేకపోతే చచ్చిపోతాడు అంటాడు చక్రపాణి. ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడారంటే.. ఇదిగో ఈ విషం తాగి చచ్చిపోతాను అంటాడు చక్రపాణి. ఇందులో విషం కలిపానని చెప్పా కదా.. అబద్ధం చెప్పేవాడిని కాదు అంటాడు చక్రపాణి.
అమ్మ నాన్న అలాగే అంటాడమ్మా… నువ్వేం పట్టించుకోకు అంటుంది. ఇంతలో తనకు ఫోన్ వస్తుంది. ఫోన్ ఇవ్వు అమ్మ అంటుంది వసుధార. ఫోన్ ఎత్తు అంటాడు. దీంతో సుమిత్ర ఫోన్ ఎత్తుతుంది. వసుధార.. ఏమైంది ఫోన్ ఎత్తడం లేదు. మీ బావ వచ్చి నీతో పెళ్లి అంటున్నాడు.
నేను వస్తున్నాను వసుధార. మీ ఇంటికి నేను వస్తున్నాను అంటాడు రిషి. మనిద్దరినీ విడదీసే శక్తి ఎవ్వరికీ లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దీంతో ఇంటికి వస్తాడా అని అనుకుంటాడు చక్రపాణి. ఇంతలో రాజీవ్ పూజారిని తీసుకొని వస్తాడు. ఇంకో గంటలో మంచి ముహూర్తం ఉందన్నారు కదా. నాకు, ఆ అమ్మాయికి పెళ్లి జరిపించండి అని రాజీవ్ పూజారితో అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.