Congress : ఇప్పుడు దేశమంతా ఎన్నికల రంగం చుట్టే తిరుగుతోంది. ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందా ఏ పార్టీ ఓడుతుందా అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికిగురి చేస్తున్నాయి. ఎందుకంటే అటు జగన్ ఒంటరిపోరాటం చేస్తుంటే ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రం కూటమిగా ఏర్పడ్డాయి. చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్న బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. కేంద్రంలో మరోసారి మోడీ ప్రధాని అవుతారని చంద్రబాబు భావిస్తున్నారు. అదే జరిగితే ఇటు ఏపీలో కూడా తన కూటమి గెలిస్తే తనకు తిరుగు ఉండదని భావిస్తున్నారు.
అయితే ఈ సారి ఎన్నికలకు ముందు వరకు మోడీ హవానే కనిపించింది. కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని.. బీజేపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఉంటుందని అనుకున్నారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి సీన్ మారిపోతోంది. కాంగ్రెస్ ఇండియా కూటమి హవా క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే జరిగిన రెండు విడుతల పోలింగ్ లో కూడా తక్కువ ఓటింగ్ నమోదు అయింది. ఇది కాంగ్రెస్ కు అనుకూలంగా మారనుంది. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం ఏపీలో చంద్రబాబు జగన్ కు ఇద్దరికీ ఇబ్బందే అని అంటున్నారు.
ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఎక్కువ అప్పులు చేసేందుకు పర్మిషన్ ఇవ్వదు. ఏపీలో ఆదాయం తక్కువ. నెల మొదటినుంచే ఖర్చులు ఉంటాయి. కనీసం జీతాలు ఇవ్వాలన్నా సరే అప్పులు చేయాల్సిందే. ఇప్పటికే అప్పుల కుప్ప పెరుగుతోంది. దానికి తోడు అటు జగన్, ఇటు చంద్రబాబు ఓ రేంజ్ లో ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారు. వాటిని అమలు చేయాలంటే భారీగా అప్పులు తేవాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు మోడీ ఉన్నారు కాబట్టి అప్పులకు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం అప్పులు ఇచ్చేందుకు పెద్దగా ముందుకు రాకపోవచ్చు.అందుకే ఈ సారి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారా అనే టెన్షన్ అటు చంద్రబాబు, ఇటు జగన్ లో ఉంది. ఎఫ్ ఆర్ ఎంబీ చట్టం ప్రకారం పరిమితిని మించి అప్పులు చేసేందుకు ఎవరూ ఒప్పుకోరు. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ వస్తే మాత్రం చంద్రబాబు, జగన్ కు ఇబ్బందులే.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.