Congress : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జగన్, బాబుకు చుక్కలే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Congress : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జగన్, బాబుకు చుక్కలే..!

 Authored By ramu | The Telugu News | Updated on :30 April 2024,9:00 pm

Congress  : ఇప్పుడు దేశమంతా ఎన్నికల రంగం చుట్టే తిరుగుతోంది. ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందా ఏ పార్టీ ఓడుతుందా అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికిగురి చేస్తున్నాయి. ఎందుకంటే అటు జగన్ ఒంటరిపోరాటం చేస్తుంటే ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రం కూటమిగా ఏర్పడ్డాయి. చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్న బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. కేంద్రంలో మరోసారి మోడీ ప్రధాని అవుతారని చంద్రబాబు భావిస్తున్నారు. అదే జరిగితే ఇటు ఏపీలో కూడా తన కూటమి గెలిస్తే తనకు తిరుగు ఉండదని భావిస్తున్నారు.

Congress  : ఆ పోలింగ్ చూస్తే..

అయితే ఈ సారి ఎన్నికలకు ముందు వరకు మోడీ హవానే కనిపించింది. కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని.. బీజేపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఉంటుందని అనుకున్నారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి సీన్ మారిపోతోంది. కాంగ్రెస్ ఇండియా కూటమి హవా క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే జరిగిన రెండు విడుతల పోలింగ్ లో కూడా తక్కువ ఓటింగ్ నమోదు అయింది. ఇది కాంగ్రెస్ కు అనుకూలంగా మారనుంది. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం ఏపీలో చంద్రబాబు జగన్ కు ఇద్దరికీ ఇబ్బందే అని అంటున్నారు.

Congress కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జగన్ బాబుకు చుక్కలే

Congress : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జగన్, బాబుకు చుక్కలే..!

ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఎక్కువ అప్పులు చేసేందుకు పర్మిషన్ ఇవ్వదు. ఏపీలో ఆదాయం తక్కువ. నెల మొదటినుంచే ఖర్చులు ఉంటాయి. కనీసం జీతాలు ఇవ్వాలన్నా సరే అప్పులు చేయాల్సిందే. ఇప్పటికే అప్పుల కుప్ప పెరుగుతోంది. దానికి తోడు అటు జగన్, ఇటు చంద్రబాబు ఓ రేంజ్ లో ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారు. వాటిని అమలు చేయాలంటే భారీగా అప్పులు తేవాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు మోడీ ఉన్నారు కాబట్టి అప్పులకు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం అప్పులు ఇచ్చేందుకు పెద్దగా ముందుకు రాకపోవచ్చు.అందుకే ఈ సారి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారా అనే టెన్షన్ అటు చంద్రబాబు, ఇటు జగన్ లో ఉంది. ఎఫ్ ఆర్ ఎంబీ చట్టం ప్రకారం పరిమితిని మించి అప్పులు చేసేందుకు ఎవరూ ఒప్పుకోరు. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ వస్తే మాత్రం చంద్రబాబు, జగన్ కు ఇబ్బందులే.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది