india vs pak
india-pakistan : ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న విభేదాల గురించి అందరికి తెలిసిందే, నిత్యం ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి దేశాల మధ్య జరిగిన జిజిఎం భేటీలో సరికొత్త ప్రకటన వచ్చింది. ఉరుములు పిడుగులు లేకుండా వచ్చిన ఈ వార్త పట్ల ఇరు దేశాల జనాభాతో పాటుగా ప్రపంచ దేశాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఉప్పు నిప్పుగా ఉంటున్న భారత్ పాకిస్తాన్ దేశాలు ఎవరు ఊహించని విధంగా శాంతి బాట పట్టాయి. పరస్పరం సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు చర్చలకు శ్రీకారం చుట్టాయి. నియంత్రణ రేఖ ఎల్ఓసీ గుండా కాల్పుల విరమణతో సహా వివిధ అంశాలపై గతంలో ఉన్న నిబంధలను కఠినంగా అమలు చేయాలనీ ఇరు దేశాలు నిర్ణయించాయి. తాజాగా జరిగిన సమావేశంలో ఇరు దేశాలు కలిసి ఉమ్మడి ప్రకటన విడుదల చేయటం అంతర్జాతీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక చైనా విషయానికి వస్తే నిన్న మొన్నటి దాక యుద్దానికి సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చిన డ్రాగన్ దేశం ఇప్పుడు శాంతి మంత్రం వల్లిస్తుంది. సరిహద్దులో ఎక్కువగా మోహరించి ఉన్న తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంటామని చైనా రక్షణ మంత్రి ప్రకటించటం జరిగింది. పైగా ఇండియాలో జరిగే బ్రిక్ సదస్సుకు తమ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని చైనా ఇప్పటికే ప్రకటించింది. ఇటు పక్క ఏమో శాంతి చర్చలకు మేము సిద్దమే అంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు.. ఇండియా అంటే ఒంటి కాలు మీద లేచే ఈ రెండు దేశాలు ఉన్నట్లు వుంది. ఇప్పుడు శాంతి చర్చలు అంటూ ముందుకు రావటం ఏంటి..? అసలు తెర వెనుక ఏమి జరిగింది అనేది ఎవరికీ అర్ధం కానీ విషయం.
అయితే ఈ రెండు దేశాల మాటలు నమ్మటానికి లేదు. చేసుకున్న ఒప్పందాలను పాటించకుండా ఉల్లంఘించట అనేది పాకిస్తాన్ కు ఉన్న అలవాటు, ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇప్పటికి దాదాపు 10 వేల సార్లు పాక్ ఉల్లఘించటం జరిగింది. మరో పక్క చైనా కూడా ఒక పక్క శాంతి అంటుంటే మరోపక్క యుద్దానికి చేయటానికి సిద్దమైయే రకం.
అయితే ఈ సారి పాకిస్తాన్ శాంతి చర్చలు అంటూ ముందుకు రావటం గతంలో చేసుకున్న ఒప్పందాలను కఠినంగా అమలుచేయాలని నిర్ణయం తీసుకోవటం వెనుక భారత్ జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఉన్నట్లు సమాచారం. ఈయనే గత కొద్దీ కాలంగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రితో వరస సమావేశాలు నిర్వహిస్తూ దానికి సంబంధించిన సమాచారం రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ కు అందిస్తున్నట్లు తెలుస్తుంది. దోవల్ జరిపిన చర్చల ఫలితంగానే పాకిస్తాన్ ఇప్పుడు శాంతి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.