Young Man : అరె.. అమ్మాయికి ప్రపోజ్ చేయబోయాడు.. పెద్ద ప్రమాదంలో పడ్డాడు.. వీడియో వైరల్..!
ప్రధానాంశాలు:
Young Man : అరె.. అమ్మాయికి ప్రపోజ్ చేయబోయాడు.. పెద్ద ప్రమాదంలో పడ్డాడు.. వీడియో వైరల్..!
Young Man : ప్రేమను వ్యక్తపరచాలన్న తపన ప్రతి ఒక్క ప్రేమికుడిలో ఉంటుంది. అందులోనూ జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా ప్రపోజ్ చేయాలనేది చాలామందిలోని కోరిక. అయితే కొన్నిసార్లు, ఈ “ప్రత్యేకత” కోసం ఎంచుకున్న మార్గం ప్రమాదకరంగా మారే అవకాశమూ ఉంది. తాజాగా ఇలాంటి సంఘటనే ఒక యువకుడి జీవితంలో అసలు ఊహించనంత ప్రమాదంగా మారింది.

Young Man : అరె.. అమ్మాయికి ప్రపోజ్ చేయబోయాడు.. పెద్ద ప్రమాదంలో పడ్డాడు
Young Man : ఇంత రిస్క్ అవసరమా..
అతని ప్రపోజ్ మోమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఒక యువకుడు తన ప్రియురాలికి జలపాతం మధ్యలో ఉన్న పెద్ద రాళ్లపై నిలబడి ప్రేమను తెలియ పరచాలని అనుకున్నారు. ఆ సమయంలో ఆమె ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉన్నారు. ఈ క్షణాన్ని “పెర్ఫెక్ట్ మూమెంట్”గా భావించిన యువకుడు జేబులో నుంచి నిశ్చితార్థపు ఉంగరం తీసి ఆమెకు ప్రపోజ్ చేయబోయాడు.
కానీ అప్పుడు అనూహ్యంగా అతని కాలు జారి, నేరుగా వేగంగా ప్రవహిస్తున్న జలపాతంలో పడిపోయాడు. అతడు నీటిలో కిందకి లొటలాడుతూ వెళ్లిపోతుండగా, అమ్మాయి షాక్‌కు గురయ్యింది. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ వీడియోను @MarchUnofficial అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి, వేలాది మంది కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది తమ ఆందోళన వ్యక్తం చేస్తూ “ప్రకృతిలో ప్రేమ వ్యక్తం చేయండి, కానీ ఇలా ప్రాణాలకు ముప్పు చేసేలా కాకూడదు” అని సూచించారు.
A dude pops the question to his girl in a crazy dangerous spot…🥺 💔 pic.twitter.com/Gzdxfza5hD
— March (@MarchUnofficial) July 4, 2025