Categories: NationalNews

karnataka minister case : న్యూ ట్విస్ట్‌: సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆ స్కాంలో ఇరికించారా?

karnataka minister case : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంత్రి కేసులో సీడీ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. కర్ణాటక జలవనరుల మంత్రి రమేష్‌ జర్కిహోళి ఉద్యోగం పేరుతో తనను శారీరకంగా వాడుకున్నాడు అంటూ ఒక మహిళ వీడియో సీడీలను బయట పెట్టిన విషయం తెల్సిందే. ఆ సంఘటనపై మంత్రి స్పందిస్తూ సమగ్ర విచారణ జరిపి నిజా నిజాలు తెలుసుకోవాలని ఇప్పుడే నిర్ణయానికి రావడం కరెక్ట్‌ కాదన్నాడు. ఆ వీడియోలు మార్ఫింగ్ అంటూ మంత్రి చెబుతూ వచ్చాడు. తాజాగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. మంత్రి పదవికి రమేష్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్య మంత్రి యడ్యూరప్ప స్వయంగా మంత్రిని ఈ స్కాంలో ఇరికించాడు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

new twist in karnataka minister Ramesh case

karnataka minister : ఆ వ్యాఖ్యలే కారణం..

ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి రమేష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు సిద్ద రామయ్య గురించి పాజిటివ్ గా మాట్లాడాడు. ఆయన గొప్ప నాయకుడు అంటూ ప్రశంసలు కురిపించాడు. గతంలో కూడా సిద్ద రామయ్యకు అనుకూలంగా రమేష్‌ మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. దాంతో ఆయన పై యడ్యూరప్ప కోపంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో యడ్యూరప్పపై కూడా రమేష్‌ విమర్శలు చేసినట్లుగా మాట్లాడటం జరిగింది. యడ్యూరప్ప తీరును ఒకటి రెండు సార్లు తప్పు బట్టిన కారణంగానే మంత్రి పదవి నుండి ఆయన్ను ఎలాగైనా తప్పించాలని కొందరు భావించడం సీఎం క్యాంప్ నుండి కూడా అందుకు మద్దతు రావడం జరిగింది. దాంతో ప్లాన్‌ పక్కాగా వేసి ఈ పని చేశారు అంటున్నారు.

అధిష్టానం వద్దకు..

తనపై జరిగిన కుట్రను బీజేపీ అధిష్టానం వద్దకు తీసుకు వెళ్లేందుకు రమేష్‌ సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. రాసీలీల టేపు విషయమై సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా ఆయన కేంద్రంను కోరాబోతున్నాడు. ఇందులో తనకు ఏదైనా సంబంధం ఉంటే అప్పుడు శిక్ష అనుభవించేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయమై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎంగా ఉన్న యడ్యూరప్ప కు వ్యతిరేకంగా ఎలాంటి బీజేపీ ఎంక్వౌరీ వేయక పోవచ్చు. కనుక మంత్రి రమేష్‌ ఇక మాజీగానే కనుమరుగవ్వాల్సి రావచ్చు అంటున్నారు.

Recent Posts

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

57 minutes ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

3 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

4 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

13 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

14 hours ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

15 hours ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

16 hours ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

17 hours ago