karnataka minister case : న్యూ ట్విస్ట్: సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆ స్కాంలో ఇరికించారా?
karnataka minister case : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంత్రి కేసులో సీడీ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. కర్ణాటక జలవనరుల మంత్రి రమేష్ జర్కిహోళి ఉద్యోగం పేరుతో తనను శారీరకంగా వాడుకున్నాడు అంటూ ఒక మహిళ వీడియో సీడీలను బయట పెట్టిన విషయం తెల్సిందే. ఆ సంఘటనపై మంత్రి స్పందిస్తూ సమగ్ర విచారణ జరిపి నిజా నిజాలు తెలుసుకోవాలని ఇప్పుడే నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదన్నాడు. ఆ వీడియోలు మార్ఫింగ్ అంటూ మంత్రి చెబుతూ వచ్చాడు. తాజాగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. మంత్రి పదవికి రమేష్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్య మంత్రి యడ్యూరప్ప స్వయంగా మంత్రిని ఈ స్కాంలో ఇరికించాడు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
karnataka minister : ఆ వ్యాఖ్యలే కారణం..
ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి రమేష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు సిద్ద రామయ్య గురించి పాజిటివ్ గా మాట్లాడాడు. ఆయన గొప్ప నాయకుడు అంటూ ప్రశంసలు కురిపించాడు. గతంలో కూడా సిద్ద రామయ్యకు అనుకూలంగా రమేష్ మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. దాంతో ఆయన పై యడ్యూరప్ప కోపంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో యడ్యూరప్పపై కూడా రమేష్ విమర్శలు చేసినట్లుగా మాట్లాడటం జరిగింది. యడ్యూరప్ప తీరును ఒకటి రెండు సార్లు తప్పు బట్టిన కారణంగానే మంత్రి పదవి నుండి ఆయన్ను ఎలాగైనా తప్పించాలని కొందరు భావించడం సీఎం క్యాంప్ నుండి కూడా అందుకు మద్దతు రావడం జరిగింది. దాంతో ప్లాన్ పక్కాగా వేసి ఈ పని చేశారు అంటున్నారు.
అధిష్టానం వద్దకు..
తనపై జరిగిన కుట్రను బీజేపీ అధిష్టానం వద్దకు తీసుకు వెళ్లేందుకు రమేష్ సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. రాసీలీల టేపు విషయమై సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా ఆయన కేంద్రంను కోరాబోతున్నాడు. ఇందులో తనకు ఏదైనా సంబంధం ఉంటే అప్పుడు శిక్ష అనుభవించేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయమై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎంగా ఉన్న యడ్యూరప్ప కు వ్యతిరేకంగా ఎలాంటి బీజేపీ ఎంక్వౌరీ వేయక పోవచ్చు. కనుక మంత్రి రమేష్ ఇక మాజీగానే కనుమరుగవ్వాల్సి రావచ్చు అంటున్నారు.