minor girl trapped through instagram and attacked
Crime News : ఒకప్పటి తరం వేరు.. ఈ తరం వేరు. ఈ తరానికి ఫోన్లు, సోషల్ మీడియానే సర్వం. అందులోనే గంటలు గంటలు గడుపుతారు. చివరకు చదువు మీద కూడా దృష్టి పెట్టడం లేదు. స్మార్ట్ ఫోన్లకు అందరూ బానిసలుగా మారిపోయారు. చిన్న పిల్లల దగ్గర్నుంచి.. పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలే. తాజాగా రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన ఓ బాలిక ఇన్ స్టాలో ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయమే తనకు లేనిపోని సమస్యలను తీసుకొచ్చింది.
minor girl trapped through instagram and attacked
15 ఏళ్ల బాలికకు 6 నెలల కింద ఇన్ స్టాలో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. అది ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఒక రోజు ఆ యువకుడు.. బాలికను కలవాలన్నాడు. దీంతో అతడిని నమ్మి.. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా అతడి వద్దకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు.. తనను పెళ్లి చేసుకుంటా అని నమ్మబలికాడు. గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నట్టు నటించారు. ఆ తర్వాత బాలికను తన రూమ్ కు తీసుకెళ్లి బంధించాడు.
అయితే.. దాదాపు రెండు నెలల పాటు ఆ బాలికపై ఆ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రతి రోజు అఘాయిత్యం చేసేవాడు. అలాగే రూమ్ లో బంధించేవాడు. అలా రెండు నెలల పాటు తనను చిత్రహింసలకు గురి చేశాడు. చివరకు ఒక రోజు తనకు ఆ రూమ్ నుంచి బయటపడే మార్గం దొరికింది. దీంతో అక్కడి నుంచి తప్పించుకున్న ఆ బాలిక.. నేరుగా తన ఇంటికి వెళ్లి జరిగిన విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే పోలీసులకు తన తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Today Gold Rate : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పడిపోతూ వస్తున్నాయి. ఏప్రిల్ 22 నుంచి…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన…
Weight Loss : బరువు తగ్గడం ఎంతో సవాలుతో కూడుకున్నది. ముఖ్యంగా చాలా మంది డైటింగ్, వ్యాయామంతో ఇబ్బంది పడుతున్నప్పుడు.…
Home Loans : ప్రతి ఒక్కరూ జీవితంలో సొంతిల్లు కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో సేవింగ్స్ ప్రారంభిస్తారు. కొందరు పూర్తిగా…
Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ లేదా పిటాయా దాని ఆరోగ్య ప్రయోజనాలకు బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ ఉష్ణమండల…
Gas Cylinder : గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి సామాన్య ప్రజలకు భారంగా మారిన సమయంలో వినియోగదారులకు ఊరట కలిగించే…
Eat Eggs In Summer : ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆహారాలలో ప్రధానమైనవి గుడ్లు. వాటి అధిక ప్రోటీన్ కంటెంట్…
Green Tea : మనలో చాలా మందికి, గ్రీన్ టీ ఆరోగ్యకరమైన జీవనశైలిని వాగ్దానం చేసే అమృతం లాంటిది. ఇది…
This website uses cookies.